Vodafone Idea Rs 202 Plan : దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం కొత్త రూ.202 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు గొప్ప వినోద అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతానికి ఈ ప్లాన్ వీఐ మొబైల్ యాప్‌లో మాత్రమే కనిపిస్తోంది. కనుక యూజర్లు ఈ యాప్ ద్వారా మాత్రమే వీఐ మూవీస్ అండ్ టీవీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఈ ప్లాన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వొడాఫోన్ ఐడియా ప్లాన్ రూ.202
వొడాఫోన్ ఐడియా రూ.202 ప్లాన్ ప్రత్యేకంగా మూవీ లవర్స్ కోసం తెచ్చినది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 13+ ఓటీటీ ఛానల్స్ చూడవచ్చు. వీఐ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ ద్వారా సర్వీస్ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్, డేటా లాంటివి లభించవు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం ఒక నెల మాత్రమే.
మొబైల్ యాప్‌లో వీఐ 'వీ మూవీస్ అండ్ టీవీ ప్రో' సబ్స్క్రిప్షన్ నెలపాటు ఉంటుంది. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను అస్వాదించవచ్చు. ఈ రూ.202 ప్లాన్ కొనుగోలు చేసిన వినియోగదారులు సోనీలివ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సన్NXT, హంగామా లాంటి 13 ఓటీటీ ఛానల్స్ కంటెంట్‌ను చూడవచ్చు.