తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో వివో కొత్త 5జీ ఫోన్‌.. ధర, ఫీచర్లివే - వివో వీ 23 కెమెరా

vivo v23 specification: చైనాకు చెందిన స్మార్ట్​ఫోన్​ సంస్థ వివో నుంచి మరో సరికొత్త ఫోన్​ విడుదలైంది. వివో వీ23, వీ 23 ప్రో పేర్లతో విపణిలోకి తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ రెండు ఫోన్లు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తాయని పేర్కొంది.

vivo v23
వివో వీ 23

By

Published : Jan 5, 2022, 8:54 PM IST

vivo v23 specification: వివో కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ శ్రేణిలో మరో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వివో వీ23 పేరుతో రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. కెమెరాపరంగా ఈ ఫోన్‌లో వివో సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. అలానే వివో వీ23 వెనుకవైపు కలర్‌ ఛేజింగ్ ఫీచర్‌ ఉంది. అంటే సూర్య కాంతి పడినప్పుడు రంగు మారతుంది. మరి ఈ ఫోన్‌లో మిగిలిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

వివో వీ 23, వీ23 ప్రో రెండు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తాయి. ఈ మోడల్స్‌ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. వీ23 ప్రో మోడల్‌లో 90 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో 6.56 అంగుళాలు, వీ23లో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. వీ23 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200, వీ23లో మీడియాటెక్ డైమెన్సీటీ 920 ప్రాసెసర్లను ఉపయోగించారు.

వీ23 ప్రోలో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు రెండు. వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ మాక్రో కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో 50 ఎంపీ, 8 ఎంపీ వైడ్ యాంగిల్‌ కెమెరాలు అమర్చారు. డ్యూయల్ కెమెరాలతోపాటు డ్యూయల్‌ ఫ్లాష్ లైట్లు కూడా ఉన్నాయి. ఇక వీ23లో కూడా ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా మినహా మిగిలిన కెమెరాలు వీ23 ప్రో మోడల్‌లో ఉన్నట్టే ఇస్తున్నారు.

వివో వీ23 ప్రోలో 4,300 ఎంఏహెచ్‌, వీ23లో 4,200 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి. ఇవి 44 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. వీ23 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 29,900, 12 జీబీ/256 జీబీ ధర రూ. 34,990. వీ23 ప్రో మోడల్‌ 8 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 38,990, 12 జీబీ/256 జీబీ ధర రూ. 43,990. జనవరి 13 నుంచి వివో, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. జనవరి 5 నుంచి ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చని వివో తెలిపింది.

ఇదీ చూడండి:Apple Display Technology: ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌.. ఫోన్‌ డిస్​ప్లేతో ఛార్జింగ్

ABOUT THE AUTHOR

...view details