తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈమె మనిషి కాదు.. కానీ సంపాదన మాత్రం కోట్లలో! - ఇన్​స్టాగ్రమ్​లో వర్చువల్​ ఇన్ల్ఫూయన్సర్​

సామాజిక మాధ్యమాల్లో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదే లాజిక్​ను బేస్​ చేసుకొని చాలామంది వివిధ రకాలైన ప్రొడక్ట్స్​ను ప్రమోట్​ చేస్తున్నారు. వీరి సంపాదన కూడా బాగానే ఉంటుంది. కానీ దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్థ ఒకడుగు ముందుకేసి ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వర్చువల్​ ఇన్​ఫ్లూయన్సర్​ను సృష్టించింది. ఈ ఖాతా ద్వారా ఏడాదికి కోట్లు సంపాదిస్తుంది. ఇంతకీ దాని కథేంటి? అసలు సంగతేంటి?

Virtual influencer Rozy
వర్చ్​వల్​ ఇన్ల్ఫూయన్సర్ రోజీ

By

Published : Sep 22, 2021, 6:46 PM IST

అందం, అభినయం, తెలివి తేటలతో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో ఫేమస్​ అవుతారు. ఇలా ప్రాచుర్యం పొందిన వారికి ఫాలోవర్లు కూడా ఎక్కువగానే ఉంటారు. చాలామంది ఫాలోవర్లు ఉన్నారంటే వారికి దగ్గర ఫాలోవర్స్​ను ఆకర్షించే ఏదో ప్రత్యేకత ఉండనే ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని వ్యాపారులు, వారి చేత ప్రకటనలు ఇప్పిస్తుంటారు. ఇలా అడ్వటైజ్​ చేసే వారినే ఇన్​ఫ్లూయన్సర్​ అంటారు. అయితే ప్రస్తుతం వర్చువల్ ఇన్​ఫ్లూయన్సర్స్​ హవా నడుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వర్చ్​వల్​ ఇన్​ఫ్లూయన్సర్​ తన యజమానికి కోట్లు కురిపిస్తోంది. దాని పేరే రోజీ.

పుట్టిన రోజు వేడకలో రోజీ

వర్చువల్​ ఇన్​ఫ్లూయన్సర్​ అంటే ఏంటి?

వర్చువల్​ ఇన్​ఫ్లూయన్సర్​ ​ అనేది నిజంలా కనిపించే ఓ అబద్ధం. అచ్చం మనిషిని పోలిన విధంగా కనిపిస్తుంది. కానీ మనిషి కాదు. బొమ్మ అని అనుకోవాలంటే కనీసం వస్తువులాగా కూడా అనిపించదు. ఇది ఓ కల్పిత పాత్ర మాత్రమే. రోజీని చూస్తే మీరు కచ్చితంగా అమ్మాయి అనే అనుకుంటారు. తను యోగా చేస్తుంది. పుట్టినరోజు అని కేక్​ మీద ఉండే క్యాండిల్​ను ఆర్పుతుంది. ఇక రోజూవారి పనులు అయిన తినడం, చదవడం, స్విమింగ్​, టబ్​బాత్ లాంటివి అచ్చం మనుషులు చేసినట్లే చేస్తుంది. అందుకే ఫాలోవర్లు ఈమె ఫాలో అవుతున్నారు.

ప్రకృతిని ఆశ్వాదిస్తున్న రోజీ
రోజీ టబ్​ బాత్​

రోజీ సంపాదన ఎంత?

సామాజిక మాధ్యమాల్లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే ప్రకటలు కూడా బాగా వస్తాయి. ఇలా రోజీకి ఉన్న ఫాలోవర్లను చూసి సుమారు 100కుపైగా కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే 8 పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకుంది రోజీ. వీటి ద్వారా తన యజమానికి ఏడాదికి రూ.6 కోట్లకు పైగా సంపాదించి పెడుతుందట. రోజీ సంపాదించే ఈ మొత్తం కొన్ని బహుళ జాతి కంపెనీల సీఈఓలు సంపాదించే దాని కంటే ఎక్కువ అని టెక్కీలు చెప్తున్నారు. కరోనా కారణంగా బాగా ప్రాచుర్యంలో వచ్చిన రోజీ.. సాధారణ ఇన్​ఫ్లూయన్సర్​​ను మించి కోట్లు సంపాదిస్తుండడం గమనార్హం.

స్విమ్మింగ్​ చేస్తున్నట్లు ఉన్న రోజీ
యోగా చేస్తున్న రోజీ

వర్చువల్ ఇన్ల్ఫూయన్సర్స్​ పుట్టుక ఎలా..?

వచ్చువల్​ ఇన్​ఫ్లూయన్సర్స్​​లు మానవ మేథస్సు నుంచి పుట్టినవి. కంప్యూటర్​ గ్రాఫిక్స్​తో 3డీ మోడలింగ్​ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తారు. అందమే ప్రామాణికంగా ఇవి రూపుదిద్దుకుంటాయి. కృత్రిమమేధతో ఇవి పని చేస్తాయి. వీటికి కేవలం కొన్ని పనులకు సంబంధించిన ప్రోగ్రామ్​ను మాత్రమే రాస్తారు. దక్షిణ కొరియాకు చెందిన రోజీని సిడూస్​ స్టూడియో ఎక్స్​ తయారు చేసింది.

ఇదీ చూడండి:ఐటీ రీఫండ్​ అంటూ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లే టార్గెట్!

ABOUT THE AUTHOR

...view details