Used laptop testing software:వాడేసిన కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను కొనడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. కొత్తవాటితో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటం వల్ల కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్‌కు ప్రాధాన్యం ఇస్తుంటాం. అలాంటప్పుడు ఎలాంటి ల్యాపీని లేదా కంప్యూటర్ను ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధం ఉంటుంది. కొత్త ల్యాప్‌టాప్‌లు అంటే వాటి ఫీచర్లు, లుక్ చూస్తే సరిపోతుంది. కానీ సెకండ్ హ్యాండ్ విషయంలో అది సరిపోదు. ఫీచర్లతో పాటు వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని టెస్టులు చేయాలి. విండోస్ పీసీ,ల్యాప్‌టాప్‌ల విషయంలో ఎలాంటి టెస్టులు చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. ర్యామ్ టెస్ట్
పీసీ లేదా ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ లేదా ర్యామ్‌ను చెక్ చేయాలి. ర్యామ్‌లో లోపాలు ఉంటే కంప్యూటర్ క్రాష్ అవుతుంటుంది. గ్రాఫిక్స్ సరిగా లోడ్ అవ్వవు. పర్ఫార్మెన్స్ నెమ్మదిస్తుంది. ఎర్రర్లకు లెక్కే ఉండదు. ర్యామ్ టెస్ట్ చేసేందుకు థర్డ్ పార్టీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, విండోస్ మెమొరీ డయాగ్నోస్టిక్ టూల్‌ను ఉపయోగించడమే బెటర్. ఈ టెస్టు చేసే ముందు ఏవైనా సేవ్ చేయని ప్రోగ్రామ్స్ ఉంటే చూసుకోవాలి.
టెస్ట్ ఇలా...
- 'విండోస్ ప్లస్ ఆర్' బటన్లు నొక్కి రన్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయాలి.
- రన్ ప్రాంప్ట్‌లో mdsched.exe టైప్ చేసి ఎంటర్ చేయాలి.
- రీస్టార్ట్ నౌ అన్న బటన్‌పై నొక్కాలి.
- ఇలా చేశాక.. విండోస్ ఓసారి రీస్టార్ట్ అవుతుంది. బూటింగ్ తర్వాత మెమొరీ డయాగ్నోస్టిక్ టూల్ పని ప్రారంభమవుతుంది. టెస్ట్ రన్ పూర్తయ్యాక విండోస్ మళ్లీ రీస్టార్ట్ అవుతుంది.
- రెండోసారి రీస్టార్ట్ అయ్యాక టెస్టు ఫలితాలు కనిపిస్తాయి. లేదంటే విండోస్ ఈవెంట్ వ్యూయర్‌ను ఉపయోగించి ఫలితాలు చూడాలి.
- ఇందుకోసం విండోస్ స్టార్ట్ బటన్‌పై మౌస్ ద్వారా లెఫ్ట్ క్లిక్ చేసి.. ఈవెంట్ వ్యూయర్పై క్లిక్ చేయాలి.
- విండోస్ లాగ్స్లోకి వెళ్లి నేవిగేట్ సిస్టమ్స్‌ను క్లిక్ చేయాలి.
- యాక్షన్స్ ట్యాబ్‌లో ఫైండ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- MemoryDiagnostic అని టైప్ చేసి ఫైండ్ నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
- అందులో టెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి.
2. హార్డ్ డ్రైవ్ చెక్
పాత పీసీలు, ల్యాప్‌టాప్‌ల హార్డ్ డ్రైవ్‌లు బాగున్నాయా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్‌లు చెడిపోతే.. డ్రైవ్‌ల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే సమాచారాన్ని కంప్యూటర్ సరిగా గుర్తించదు. ఫైల్ లోడింగ్ ఆలస్యం అవుతుంది. కంప్యూటర్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
- క్రిస్టల్డిస్క్ఇన్ఫో అనే టూల్ ద్వారా హార్డ్ డ్రైవ్‌ల గురించి తెలుసుకోవచ్చు.
- ఫస్ట్, క్రిస్టల్డిస్క్ఇన్ఫోను ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ఈ టూల్‌ని ఓపెన్ చేయగానే హార్డ్ డ్రైవ్‌ల గురించి సమాచారం మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఒకటికంటే ఎక్కువ డ్రైవ్‌లు ఉన్నా సులభంగా దీని ద్వారా చూసేయొచ్చు.
- హార్డ్ డ్రైవ్ టెంపరేచర్ 30 నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉంటే దాన్ని ఆరోగ్యకరమైన డ్రైవ్‌గా పరిగణిస్తారు. ఎట్టిపరిస్థితుల్లో టెంపరేచర్ 70కి మించకూడదు.