తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అప్​స్టాక్స్​పై సైబర్ దాడి- కీలక డేటా లీక్​ - అప్​స్టాక్స్ కేవైసీ డేటా లీక్​

దేశీయ రిటైల్ బ్రోకింగ్ సంస్థ అప్​​స్టాక్స్​పై సైబర్ దాడి జరిగింది. ఇందులో యూజర్ల కాంటాక్ట్​, కేవైసీ వివరాలు లీకైనట్లు అప్​స్టాక్స్ వెల్లడించింది. సైబర్ దాడిపై ఓ అంతర్జాతీయ సంస్థతో దర్యాప్తు జరిపిస్తున్నట్లు వివరించింది.

upstox data leak
అప్​స్టాక్స్ డేటా లీక్​

By

Published : Apr 11, 2021, 5:01 PM IST

Updated : Apr 11, 2021, 5:09 PM IST

ఫేస్​బుక్​, మొబిక్విక్​, లింక్డ్​ఇన్​లలో డేటా లీక్ గురించి మరువక ముందే.. మరో సంస్థ కూడా హ్యాకింగ్ బారినపడింది. ప్రముఖ రిటైల్ బ్రోకింగ్ సంస్థ అప్​స్టాక్స్​పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. ఈ విషయాన్ని అప్​స్టాక్స్ స్వయంగా వెల్లడించింది.

ఈ సైబర్​ దాడిలో యూజర్ల కాంటాక్ట్స్​ , కేవైసీ వివరాలు లీకైనట్లు తెలిపింది అప్​స్టాక్స్​. కానీ కచ్చితంగా ఎంతమంది డేటా లీకైందనే విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే యూజర్ల ఫండ్స్​, సెక్యూరిటీలు మాత్రం భద్రంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

లీక్​ అయిన డేటా శాంపిళ్లను హ్యాకర్లు ఆదివారం ఉదయం డార్క్​వెబ్​లో ఉంచినట్లు అప్​స్టాక్స్ అధికార ప్రతినిధి ఒకరు యూజర్లకు పంపిన ఈ-మెయిల్​లో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఓ అంతర్జాతీయ సైబర్​ సెక్యూరిటీ సంస్థను నియమించినట్లు వెల్లడించారు.

డేటా భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని యూజర్లకు తెలిపింది అప్​స్టాక్స్​. ముఖ్యంగా థర్డ్​ పార్టీ వేర్​హౌజ్​లలో ఉంచిన డేటాకు భద్రతను పెంచినట్లు వెల్లడించింది. డేటాపై 24x7 నిఘా ఉంచినట్లు పేర్కొంది. యూజర్లకు ఓటీపీ ద్వారా పాస్​వర్డ్​లు మార్చుకోమని కూడా సూచించినట్లు అప్​స్టాక్స్ వివరించింది.

రతన్​ టాటా, టైగర్​ గ్లోబల్​ వంటి దిగ్గజాల పెట్టుబడులున్న అప్​స్టాక్స్​కు ప్రస్తుతం 30లక్షల మందికి పైగా యూజర్లు ఉన్నారు.

ఇదీ చదవండి:50 కోట్ల లింక్డ్ఇన్​ యూజర్ల డేటా లీక్!

Last Updated : Apr 11, 2021, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details