తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అదిరిపోయే ఫీచర్లు, సరికొత్త డిజైన్లు.. త్వరలో రానున్న ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే! - iqoo neo 7 pro launch date

Upcoming Mobile 2023 In India : ఈ ఏడాది మార్కెట్‌లోకి సరికొత్త డిజైన్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ ఫోన్ల కోసం చాలామంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది కొత్త ఫీచర్లతో విడుదల కానున్న ఐదు ఫోన్ల గురించి తెలుసుకుందామా..?

Upcoming Mobile 2023 In India
Upcoming Mobile 2023 In India

By

Published : Jul 3, 2023, 9:19 AM IST

Upcoming Mobile 2023 In India : ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సాంకేతికత అనేది ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. రోజురోజుకు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్‌లోకి వస్తోంది. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో స్మార్ట్‌ఫోన్లు అనేవి కీలకంగా మారుతున్నాయి. కొత్త ఫీచర్‌తో కూడిన అప్​డేట్ వెర్షన్ కలిగిన స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా మార్కెట్‌లోకి కొత్తగా అనేక స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. వీటి కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది రానున్న వివిధ కంపెనీల కొత్త స్మార్ట్‌ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5
Samsung z fold 5 release date : జులై చివరిలో జరిగే తమ అన్‌ప్యాక్డ్ కార్యక్రమంలో ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ Z ఫోల్డ్​ 5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సామ్‌సంగ్ సిద్దమవుతోంది. గెలాక్సీ Z ఫోల్డ్‌ 4 ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లోకి రాగా.. దానికి అప్​డేట్ వెర్షన్‌గా గెలాక్సీ Z ఫోల్డ్ 5ని తీసుకువస్తున్నారు. చాలా మందంగా ఉండేలా కొత్త డిజైన్‌తో ఈ ఫోన్ తయారుచేస్తున్నారు. ఓ‌ఎల్‌ఈడీ స్క్రీన్‌తో పాటు స్నాప్​డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ, మెరుగైన అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుందని సమాచారం.

సామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5
Samsung z flip 5 release date ఈ ఫోన్ పెద్ద కవర్ డిస్​ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన ఫీచర్లు ప్రస్తుతం ఉన్న గెలాక్సీ Z ఫ్లిప్ 4 మాదిరిగా ఉండనున్నాయి. ఈ ఫ్లిప్ 5 వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 12 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఫ్లిప్ ఫోన్ ధరలు చాలా తక్కువగా ఉండటమే కాకుండా కాంప్టాక్ డిజైన్లతో బాగా ప్రాచుర్యం పొందాయి.

నథింగ్ ఫోన్ (2)
Nothing phone 2 launch date ఇండియాలో త్వరలో విడుదల కాబోతున్న అత్యంత ఆసక్తిగల ఫోన్ ఇది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లాస్ జెన్ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను బూట్ చేయడమే కాకుండా వెనకవైపు మెరుగైన గ్లిఫ్ లైటింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే వెనుకవైపు సూపర్​ డ్యూయల్ కెమెరా సిస్టమ్ కూడా ఉంటుంది.

మోటోరోలా Razr 40 సిరీస్
Motorola razr 40 ultra launch date in India : భారతదేశంలో Razr 40, Razr 40 అల్ట్రా ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు మోటోరాలా సంస్థ తెలిపింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో వీటిని అమ్మకానికి పెట్టనుంది. Razr 40 అల్ట్రా ఫోన్ అతిపెద్ద 3.6 అంగుళాల ఫోల్డ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫ్లిప్ ఫోన్‌గా దీనిని చెప్పవచ్చు.

iQOO నియో 7 ప్రో
iqoo neo 7 pro launch date ఈ ఫోన్‌ను జులై 7న విడుదల చేయనున్నారు. డ్యూయల్ చిప్ కలిగి ఉండే ఈ ఫోన్.. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్‌ఓసీ కలిగి ఉంటుంది. అలాగే గేమింగ్ చిప్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో 120 హెచ్‌జెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఆరెంజ్ కలర్ ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను ఈ ఫోన్ కలిగి ఉండగా.. ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రన్ కానుంది.

ఇవీ చదవండి :OnePlus 12 Release : కొత్త హంగులతో వన్​ ప్లస్​ 12.. కెమెరా, ఫీచర్స్​ అదుర్స్!

OnePlus New Phone : జులై 5న వన్​ప్లస్​ నార్డ్ సిరీస్​ ఫోన్స్​ లాంఛ్​.. స్పెక్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే!

ABOUT THE AUTHOR

...view details