ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను పలకరిస్తుంటుంది. ఇటీవలే డిసెప్పియర్ మెసేజెస్, వన్‌టైమ్ ఫొటోలాంటి కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరికొన్ని ఫీచర్లను పరిచయం చేయబోతుంది.
వాట్సాప్ ఫొటో క్వాలిటీ..
వాట్సాప్‌లో ఏదైనా ఫొటో పంపిస్తే దాని ఒరిజినల్ క్వాలిటీ అనేది తగ్గడం సహజం. అందువల్ల చాలా మంది ఫొటోను డాక్యుమెంట్ రూపంలో షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టేలా వాట్సాప్ డ్రాయింగ్ టూల్ హెడర్‌కు కొత్త టెక్నాలజీని చేర్చనుంది. దీని వల్ల యూజర్లు ఫొటో క్వాలిటీని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఫొటోను పంపించే ముందు ఒక టూల్ బార్ కనిపిస్తుంది. ఈ టూల్ సహాయంతో ఫొటో క్లారిటీని యూజర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఒరిజినల్ క్వాలిటీ ఫొటోను పంపించుకోవచ్చు.
గ్రూప్ సబ్జెక్ట్ , డిస్క్రిప్షన్ పదాలలో మార్పు
వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్ పెట్టడానికి కేవలం 25 పదాలను మాత్రమే ఉపయోగించుకోగలం. అయితే అది ఇప్పుడు వంద అక్షరాల వరకు పరమితి పెంచనుంది. దాంతో పాటు గ్రూప్ డిస్క్రిప్షన్ పదాల పరిమితిని కూడా పెంచనుంది. ఇంతకు ముందు డిస్క్రిప్షన్ రాయడానికి 512 అక్షరాలు మాత్రమే పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని 2048 అక్షరాలకు పెంచనుంది వాట్సాప్.
కొత్త ఫాంట్ స్టైల్స్
యూజర్లు కొత్తరకం ఫాంట్లను ఉపయోగించుకునేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది వాట్సాప్. కాలిస్టోగా, కొరియర్ ప్రైమ్, డామియన్, ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ ఫాంట్‌లను వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్‌కు జోడించనుంది.