మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఇట్టే చెప్పేస్తాయి ఎమోజీలు. పది పదాలు అవసరమైన చోట ఒక్క ఎమోజీతో(Emoji Images) మన మూడ్‌ని చెప్పేయొచ్చు. నిత్యం మనం ఉపయోగిస్తున్న వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్.. ఇలా ప్రతి సోషల్ మీడియా యాప్‌లోనూ(Emojis In Symbols) వీటిది ప్రత్యేక స్థానం. అందుకే సోషల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఎమోజీలను తీసుకొస్తూ యూజర్స్‌ను అలరిస్తున్నాయి. తాజాగా యూనికోడ్(Emoji Unicode Table) కన్సార్టియమ్ అనే సంస్థ 37 కొత్త ఎమోజీలను విడుదల చేసింది.
యూనికోడ్ కన్సార్టియమ్(Unicode Consortium) నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ కొత్త ఎమోజీ జాబితాను రూపొందించినట్లు యూనికోడ్(Unicode) తెలిపింది. వీటిని ఎమోజీ సబ్‌కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కు అందుబాటులోకి వస్తాయని యూనికోడ్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలోనే యూనికోడ్ 14.0 విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు తెలిపింది.