Two Whatsapp Accounts In One Mobile : గతంలో ఒక ఫోన్లో ఒకటే వాట్సాప్ వినియోగించుకునే అవకాశముండేది. కానీ వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా వినియోగదారుల కోసం ఒకే డివైజ్‌లో రెండు వాట్సాప్ ఖాతాల్ని ఉపయోగించుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల ఒకే ఫోన్లో రెండు అకౌంట్లకు స్విచ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. మన కాంటాక్ట్స్‌ని సింక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్లు కూడా వేర్వేరుగా వస్తాయి.
ఫీచర్లు ఇవే!
ఒకే ఫోన్లో రెండు వాట్సప్ ఖాతాలను ఉపయోగించడం అనేది చాలా మందికి కావాల్సిన ఫీచర్. దీనితో ఇప్పటికే ఉన్న ఖాతాకు మరో నంబరుని జోడించవచ్చు. ఇంకో ఫోన్లో మరో అకౌంట్ ఉపయోగిస్తే.. ఆఫోన్అవసరం లేకుండా.. దాన్ని కూడా ఒకే డివైజ్‌లో యూజ్ చేయవచ్చు. వాట్సప్‌లో రెండో అకౌంట్ పెట్టుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది మన వ్యక్తిగత అకౌంట్, బిజినెస్ అకౌంట్‌ను వేరు పరుస్తుంది. మరి కొందరికి వారి చాట్స్‌ను సీక్రెట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఒకే ఫోన్లో రెండో వాట్సాప్ అకౌంట్‌ను యూజ్ చేయడానికి..
యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున పైనున్న 3 చుక్కలు ప్రెస్ చేసి సెట్టింగ్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ప్రొఫైల్ పిక్, పేరు పక్కన క్యూఆర్ కోడ్ కనబడుతుంది. దాని పక్కనే ఒక ఆరో మార్క్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే.. యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ రెండో అకౌంట్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదటి సారి వాట్సాప్ అకౌంట్‌ను సైన్ అప్ చేసేటప్పటిలాగే ఉంటుంది. మీ ఫోన్లో రెండో ఖాతాను జోడించిన తర్వాత.. ప్రతి ఖాతాకు సంబంధించిన చాట్స్, అప్ డేట్స్, కమ్యూనిటీస్, కాల్స్ యాక్సెస్ కోసం రెండింటి మధ్య స్వాప్ చేయాల్సి ఉంటుంది.