తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ట్విట్టర్ 'బ్లూ టిక్' తిరిగొస్తోంది- షరతులతో! - verification programme Twitter

ట్విట్టర్​లో ఖాతా ధ్రువీకరణ 2021 నుంచి అందుబాటులోకి రానుంది. మూడేళ్ల పాటు నిలిచిపోయిన ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. నూతన ధ్రువీకరణ పాలసీపై ఫీడ్​బ్యాక్ అందించాలని వినియోగదారులను కోరింది. ట్విట్టర్​ నియమాలను అతిక్రమించే ఖాతాలకు వెరిఫికేషన్​ను రద్దు చేస్తామని తేల్చిచెప్పింది.

Twitter to bring back 'blue tick' in early 2021
ట్విట్టర్ 'బ్లూ బ్యాడ్జ్' వచ్చేస్తోంది.. షరతులతో!

By

Published : Nov 25, 2020, 3:32 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ఖాతా ధ్రువీకరణ ప్రక్రియను ట్విట్టర్​ తిరిగి ప్రారంభించనుంది. యాక్టివ్ యూజర్లు, ప్రామాణికమైన వినియోగదారులు తమ ఖాతాలను ధ్రువీకరించుకొని 'బ్లూ వెరిఫికేషన్ బ్యాడ్జ్​'ను పొందే వెసులుబాటు దక్కనుంది. ఈ ప్రక్రియ ఏకపక్షంగా, గందరగోళంగా ఉందని ఫీడ్​బ్యాక్ అందిన కారణంగా ఖాతా ధ్రువీకరణను ట్విట్టర్​ మూడేళ్ల క్రితం నిలిపివేసింది. తర్వాత పునరుద్ధరించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అమెరికా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని పక్కనబెట్టింది.

తాజాగా ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. 2021 నుంచి ఈ వెసులుబాటు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. నూతన ధ్రువీకరణ పాలసీపై ఫీడ్​బ్యాక్ అందించాలని వినియోగదారులను కోరింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 8 వరకు తమ అభిప్రాయాలు పంపించవచ్చని తెలిపింది.

ఆరు రకాల ఖాతాలకు బ్లూ బ్యాడ్జ్ ఇస్తుంది ట్విట్టర్. ప్రభుత్వాలు, కంపెనీలు, బ్రాండ్​లు-లాభాపేక్ష సంస్థలు, వార్తలు, వినోదం, క్రీడలు, కార్యకర్తలు, నిర్వాహకులు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.

షరతులు!

అయితే ఈ కేటగిరీలతో పాటు ఖాతా ధ్రువీకరణకు అవసరమైన ప్రమాణాలను వచ్చే ఏడాది నాటికి గణనీయంగా పెంచనున్నట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది. బ్లూ టిక్​ పొందాలంటే ట్విట్టర్ ఖాతా యాక్టివ్​గా, గుర్తించగలిగే విధంగా ఉండాలని పేర్కొంది. ఖాతా అసంపూర్తిగా ఉన్నా, యాక్టివ్​గా లేకున్నా వెరిఫికేషన్​ను ఆటోమేటిక్​గా నిలిపివేసే ప్రతిపాదనపైనా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. ట్విట్టర్​ నియమాలను అతిక్రమించే ఖాతాలకు వెరిఫికేషన్​ను రద్దు చేయడం లేదా తిరస్కరించడం చేస్తామని తేల్చిచెప్పింది.

"ట్విట్టర్​లో చాలా వెరిఫైడ్ ఖాతాలు ఉన్నాయి. నిజానికి అన్ని ఉండాల్సింది కాదు. యాక్టివ్​గా లేని, ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉన్న ఖాతాలకు ఆటోమెటిక్​గా వెరిఫికేషన్ బ్యాడ్జ్​ను తీసివేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2021 నాటికి అదనపు ఖాతా వర్గాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది."

-ట్విట్టర్

ఖాతా ధ్రువీకరణ కోసం ఒక్క బ్లూ టిక్​ మాత్రమే కాకుండా ఇతర మార్గాలను రూపొందిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. 2021లో కొత్త లేబుళ్లతో వ్యక్తులు తమను తాము ధ్రువీకరించుకోవచ్చని వెల్లడించింది.

ఇదీ చదవండి-'అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం!'

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details