మెసేజింగ్ యాప్‌లు వచ్చాక ఎమోజీల వినియోగం బాగా పెరిగిపోయింది. బాధ, ఆనందం, కోపం, అభినందనలు, ప్రేమ, అనుమానం.. ఇంకా ఇలాంటివి ఏవైనా సరే ఎమోజీలతో చెప్పే అవకాశం ఉంది. మాటల్లో చెప్పలేని వాటిని ఎమోజీలతో వ్యక్తీకరించవచ్చు. ట్విట్టర్‌లోనూ ఎమోజీలను తెగ వాడేస్తుంటారు యూజర్లు. ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా మరొక ఫీచర్‌ను ట్విట్టర్(Twitter New Features) తీసుకొచ్చేందుకు టెస్టింగ్ నిర్వహిస్తోంది. యూజర్ ఓ ట్వీట్‌కు(twitter updates) ఎమోజీలను వాడాలంటే రిప్లై బాక్స్‌లోకి వెళ్లి సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఇక టెస్టింగ్ ఓకే అయితే ఎలాంటి ఆలస్యం లేకుండా ట్వీట్‌కే ఎమోజీలను జోడించేందుకు ట్విట్టర్ ఫీచర్‌ను(Twitter New updates) అప్‌డేట్ చేయనుంది. అయితే ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు 'యాంగ్రీఫేస్', 'థంబ్స్‌డౌన్' ఎమోజీలు ట్విట్టర్‌లో కనిపించవు. దీనికి కారణమేంటో కూడా ట్విట్టర్ వివరణ ఇచ్చింది.
నెగిటివిటీ ఎమోజీలను వాడటం వల్ల యూజర్ల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఎమోజీ రియాక్షన్ ఫీచర్ ప్రస్తుతానికి టర్కీ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని ట్విట్టర్ తెలిపింది. టెస్టింగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి మిగతా దేశాల యూజర్లకు విస్తరిస్తామని వెల్లడించింది.