Twitter Server Down Today :ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 11:02 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన వీటి సేవలు దాదాపు గంట తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్స్‌కు ఈ సమస్య తలెత్తింది. దీంతో కొందరు యూజర్స్ సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెంబర్షిప్ యూజర్స్‌కు సైతం
Twitter Services Restored :తమ ట్విట్టర్ ఖాతాలను తెరవగానే టైమ్లైన్లు ఖాళీగా కనిపించాయని పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఏదైనా పోస్ట్ చేస్తే ఆ ట్వీట్లు మాత్రం టైమ్‌లైన్‌లో కన్పించలేదని తెలిపారు. అటు ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయని చెప్పారు. సాధారణ ట్విట్టర్ అకౌంట్‌తో పాటు ట్విట్టర్ ప్రీమియం, ఎక్స్-ప్రో వెర్షన్‌ల సేవలకు కూడా ఈ అంతరాయం ఏర్పడినట్లు మెంబర్షిప్ యూజర్స్ కొందరు పేర్కొన్నారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరీ ట్విట్టర్ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు.
దేశంలో 4,000 మంది, ప్రపంచవ్యాప్తంగా 73,800 మంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ సర్వర్ డౌన్ సమస్యపై ఫిర్యాదులు చేశారని ఓ ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. దీనిపై దాదాపు 64 శాతం మంది యూజర్స్ ట్విట్టర్ వేదికగా రిపోర్ట్ చేయగా 29 శాతం మంది డౌన్‌డిటెక్టర్ అనే ప్రముఖ వెబ్సైట్ ద్వారా కంప్లైంట్ చేశారని చెప్పింది.