తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!

ఫిషింగ్​.. ప్రస్తుత ఆన్​లైన్​ యుగంలో ఎక్కువ మంది సైబర్​ మోసగాళ్లు వినియోగిస్తున్న టెక్నిక్​. ఇది పాతతరం మోసాల్లో ఒకటి అయినా పక్కాగా బుట్టలో పడేసేందుకు కేటుగాళ్లకు బాగా పనికొచ్చే అస్త్రం. ఉత్తరకొరియాకు చెందిన లాజరస్​ అనే హ్యాకర్​ గ్రూప్​ దాదాపు 20 లక్షల మంది భారతీయుల అకౌంట్లపై ఈ తరహా దాడి చేసేందుకు యత్నిస్తున్నట్లు ఇటీవలె భారత సాంకేతిక నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అసలు ఫిషింగ్​ అంటే ఏమిటి? దానితో ఎలా వివరాలు సేకరిస్తారు? తెలుసుకుందాం.

By

Published : Jun 21, 2020, 3:09 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

jagte raho in etvbharat telugu
జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!

కరోనా వంటి కష్టకాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 'రిమోట్​ వర్కింగ్'​,'వర్క్​ ఫ్రం హోమ్'​ వంటి వాటి వల్ల ప్రజలంతా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలు, ఫుడ్​ డెలివరీ, బ్యాంకింగ్ వంటి సేవల కోసం ఆన్​లైన్​ బాటపట్టారు ప్రజలు. ఇక వినోదం కోసం వివిధ రకాల యాప్​లు, వెబ్​సైట్లను ఆశ్రయిస్తున్నారు. భారత్​ డేటా వినియోగంలో దూసుకెళ్తోంది. ఇదే అదనుగా భావించిన కొన్ని శత్రుదేశాలు.. ప్రత్యక్షంగా ఏమీ చేయలేక.. దేశంలో సాంకేతిక ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవలె ఆస్ట్రేలియాపై భారీ సైబర్​ దాడి చేసి కొవిడ్​-19, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం దోచుకున్నట్లు ఆ దేశ ప్రధానే స్వయంగా ప్రకటించారు. ఇదే తరహాలో భారత్​పైనా దాడికి పాల్పడేందుకు ఉత్తర కొరియాకు చెందిన కొందరు హ్యాకర్లు పన్నాగాలు పన్నుతున్నట్లు సైబర్​ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవగాహన, జాగ్రత్తల ద్వారా బాధితులుగా మారకుండా చూసుకోవచ్చని చెప్తున్నారు.

ఇప్పటికే లాజరస్​కు చెందిన హ్యాకర్లు.. జపాన్​ యూజర్లకు చెందిన 11 లక్షల ఈ-మెయిల్​ డేటా, భారత్​ నుంచి 20 లక్షల మంది యూజర్ల సమాచారం, లక్షా 80 వేల మంది బ్రిటన్​ వినియోగదారుల సమచారం తస్కరించినట్లు ప్రకటించారు. దాన్ని డార్క్​ వెబ్​లో అమ్మకానికి పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిషింగ్​ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలివే..

ఫిషింగ్​ అంటే?
ఫిషింగ్​ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details