మహమ్మారి కరోనా వల్ల మానవుల సాంకేతిక జీవనశైలిలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఇంటి వద్ద నుంచి పని చేయడం(వర్క్ ఫ్రమ్ హోమ్), పిల్లలకు ఆన్లైన్ పాఠాలు, కాలక్షేపం కోసం లైవ్‌స్ట్రీమ్‌లో వీడియోల వీక్షణ, ఆన్లైన్ గేమ్స్ ఆడటం.. ఇలా ప్రపంచమంతా ఇంటర్నెట్ ఆధారంగానే పని చేస్తోంది. ఈ క్రమంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు గిరాకీ బాగా పెరిగింది.
ఇలాంటి సమయంలో ప్రస్తుతం మీరు వాడుతున్న బ్రాడ్‌బ్యాండ్ సంస్థ.. మీ అవసరాన్ని తీర్చలేకపోవచ్చు! ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్పీ)ల మోసపూరిత వాగ్దానాలు, వినియోగదారుల సేవల్లో జాప్యం, ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడం వంటి సమస్యలతో మీరు విసుగు చెంది ఉండొచ్చు. అందుకే తమ బ్రాడ్‌బ్యాండ్‌ను లేదా ప్లాన్‌ను మార్చుకోవాలని చాలా మంది చూస్తారు. వారు ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.
హై స్పీడ్ ఇంటర్నెట్
వినియోగదారులు వేరే బ్రాడ్‌బ్యాండ్‌కు మారాలని ఆలోచన రావడానికి అతి సాధారణ కారణం ఇంటర్నెట్ స్పీడ్. ప్రతి వినియోగదారుడు నెట్ వేగంగా రావాలనే కోరుకుంటాడు. గేమ్స్ ఆడేవారైతే సౌకర్యవంతమైన గేమింగ్ కోసం.. డౌన్లోడ్, అప్లోడ్ వేగం ఎక్కువ ఉండాలని చూస్తారు. అనేక వేదికలపై కంటెంట్ షేర్ చేసేవారికి ఇంటర్నెట్ ఇంకా కీలకం. అయితే ప్రస్తుతం ఉన్న బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్.. వినియోగదారుని అవసరాలు తీర్చలేకపోచ్చు. ఫలితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ప్లాన్ కావాలనుకుంటారు. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల(ఐఎస్పీ) కోసం అన్వేషిస్తారు. కాబట్టి బ్రాండ్‌బ్యాండ్ మారేటప్పుడు.. హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వగలిగే నెట్‌వర్క్ సంస్థలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉండేలా..
కస్టమర్ సేవల్లో జాప్యం.. వినియోగదారులు వేరే బ్రాడ్‌బ్యాండ్ మారడానికి మరో ప్రధానమైన కారణం. కొన్నిసార్లు సాంకేతి సమస్యలను పరిష్కరించడంలో ఐఎస్పీలు విఫలం అవుతారు. ఇది వినియోగదారులను ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు వైపు మళ్లిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను మార్చడానికి ముందు,.. వినియోగదారులు కస్టమర్ సేవలకు సంబంధించి మంచి ఫీడ్‌బ్యాక్ ఉన్న సర్వీసు ప్రొవైడర్ల గురించి తెలుసుకోవాలి.
ఫైబర్ టెక్నాలజీ లభ్యత