తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

శాంసంగ్ నుంచి మరిన్ని స్మార్ట్​టీవీలు- రూ. 20 వేలకే! - శాంసంగ్ అన్​బాక్స్​ మ్యాజిక్

శాంసంగ్​ మరిన్ని టీవీ వెరైటీలతో మార్కెట్​లోకి వచ్చింది. క్రిస్టల్ 4కే యూహెచ్​డీ, అన్​బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీ సిరీస్​లను ఆవిష్కరించింది. వేరియంట్లను బట్టి వీటి ధర రూ. 20,900 నుంచి రూ. 2.37 లక్షల మధ్య నిర్ణయించింది.

Samsung launches 2020 Smart TV line-up with Crystal 4K UHD, Unbox Magic 3.0 series
శాంసంగ్ నుంచి మరిన్ని స్మార్ట్​టీవీలు- రూ. 20 వేలకే!

By

Published : Jul 8, 2020, 9:56 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

శాంసంగ్ సంస్థ సరికొత్త స్మార్ట్​టీవీలతో ముందుకొచ్చింది. 2020 స్మార్ట్​ టీవీ లైనప్​లో క్రిస్టల్ 4కే యూహెచ్​డీ, అన్​బాక్స్​ మ్యాజిక్ 3.0 టీవీ సిరీస్​లను ఆవిష్కరించింది.

క్రిస్టల్ 4కే యూహెచ్​డీ టీవీలో క్రిస్టల్ సాంకేతికతతో పాటు 4కే క్వాలిటీని పెంచే​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​ సామర్థ్యం ఉందని వెల్లడించింది.

43, 50, 55, 65, 75 అంగుళాల తెర పరిమాణాలతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. టీవీల ధర రూ. 44,400 నుంచి రూ. 2.37 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.

అన్​బాక్స్ మ్యాజిక్ 3.0

మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా అన్​బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్​ను రూపొందించింది శాంసంగ్. 32 అంగుళాల టీవీ ధరను రూ. 20,900, 43 అంగుళాల టీవీ ధరను రూ. 41,900గా నిర్ణయించింది.

"కొత్త స్మార్ట్ టీవీ లైనప్ కంటెంట్ వినియోగధోరణిపై ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు నిరంతర అనుభవం పొందే విధంగా విస్తృత రకాల ఓటీటీ ప్లాట్​ఫాంలు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. క్రిస్టల్ 4కే యూహెచ్​డీ టీవీ ఈ సెగ్మెంట్​లో సంస్థ మార్కెట్ లీడర్​షిప్​ను మరింత దృఢపరుస్తుందని మాకు నమ్మకం ఉంది."

-రాజు పుల్లన్, శాంసంగ్ ఇండియా సీనియర్ వీపీ

2020 స్మార్ట్​ టీవీ సిరీస్​లోని రిమోట్​లలో నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ఓటీటీలకు ప్రత్యేక బటన్​లను ఏర్పాటు చేసింది శాంసంగ్. వీటితో పాటు మరిన్ని ఓటీటీ ప్లాట్​ఫాంలను వినియోగించుకునే వీలు కల్పించింది.

జూన్ 30న 2020 లైనప్​లోనే అల్ట్రా-ప్రీమియం క్యూఎల్​ఈడీ 8కే టీవీని విడుదల చేసింది. వీటి ధరలు

  • 65 అంగుళాల టీవీ రూ. 4.99 లక్షలు
  • 75 అంగుళాల టీవీ రూ. 9.99 లక్షలు
  • 82 అంగుళాల టీవీ రూ. 14.29 లక్షలు
  • 85 అంగుళాల టీవీ రూ. 15.79 లక్షలు

ఇదీ చదవండి-టిక్​టాక్​ ఫీచర్లతో ఇన్​స్టాగ్రామ్ 'రీల్స్​'

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details