కరోనా లాక్డౌన్ సడలింపులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ సంస్థలు జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో మోటోరోలా కాస్త ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఐరోపా మార్కెట్లో మోటోజీ 5జీ ప్లస్ పేరుతో కొత్త ప్రీమియం మోడల్‌ను ఆవిష్కరించింది. ఇటీవలే ఫ్యూజన్ పేరుతో భారత్‌లో ఓ మోడల్‌ను విడుదల చేయడం గమనార్హం.
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (1టీబీ వరకు పెంచుకునే సదుపాయం) వేరియంట్లలో మోటోజీ 5జీ ప్లస్‌ను అందుబాటులోకి తెచ్చింది మోటో. వీటి ధరలు వరుసగా 349 యూరోలు (దాదాపు రూ.30 వేలు), 399 యూరోలు (దాదాపు రూ.33,730)గా నిర్ణయించింది.