తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2020, 2:38 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ETV Bharat / science-and-technology

హత్యలు చేసే రోబోలు.. మతి పోగొట్టే నిజాలు!

సాంకేతిక రంగానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. ఉదయం లేచింది మొదలు.. టీవీ, ఫోన్​, ఫ్రిడ్జ్​, మిక్సీ, బైక్​, కారు... ఇలా మన మనుగడే సాంకేతికతమయమైంది. మరి, ఇంతలా మన జీవితాల్లో చొచ్చుకుపోయిన సాంకేతిక రంగంలో మీకు తెలియని.. మీరు ఊహించని కొన్ని వాస్తవాలు మీ కోసం..

mind-blowing-facts-technology-killing-robos-and
హత్యలు చేసే రోబోలు.. మతి పోగొట్టే వాస్తపాలు

ఇప్పటి వరకు మనం వాడుతున్న కొన్ని వస్తువులు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే కొన్ని సాంకేతిక ఉత్పత్తులు మీ జీవితాన్నే మార్చేయనున్నాయి. వాటిలో కొన్ని...

వైరస్​-ఐ లవ్​ యూ...

'ఐ లవ్​ యూ' అనే వైరస్​ ఉందని మీకు తెలుసా ? అవును, ఈమెయిల్​లో ఓ లవ్​లెటర్​ రూపంలో పుట్టుకొచ్చిన ఈ వైరస్​.. సాఫ్ట్​వేర్​ రంగాన్ని ముప్పతిప్పలు పెట్టింది. ఈ వైరస్​ వేగంగా వ్యాపించడమే కాదు, ఆ వైరస్​ ఉన్న అటాచ్​మెంట్లపై క్లిక్​ చేయగానే.. కంప్యూటర్​లోని మిగతా డేటాను తన ప్రతిరూపాలుగా మార్చేస్తుంది.

హత్యలు చేసే రోబోలు...

హత్యలు చేసే రోబోలు...

2033 నాటికి.. హత్యలు చేసే రోబోలు పుట్టుకొస్తాయంటున్నారు నిపుణులు. అవును, వ్యక్తిని పట్టుకుని చంపమని కీ ఇస్తే చాలు... తు.చ తప్పకుండా ఎంతమందిలో ఉన్నా మర్డర్​ చేసే రోబోలను సృష్టిస్తున్నారట కొందరు శాస్త్రవేత్తలు.

యూట్యూబ్​ను కనిపెట్టిన మాఫియా....

యూట్యూబ్​ను కనిపెట్టిన మాఫియా....

ఉదయం లేచింది మొదలు యూట్యూబ్​తోనే మనకు కాలక్షేపం. కానీ, ఆ యూట్యూబ్​ కనిపెట్టింది ఓ మాఫియా అని మీకు తెలుసా? అవును, ఒక్క యూట్యూబే కాదు.. లింక్డ్ఇన్, యెల్ప్, స్పేసెక్స్ లాంటి ప్రజాదరణ పొందిన ఎన్నో యాప్​లు.. పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులే సృష్టించారు. అందుకే వీటిని సమష్టిగా పేపాల్ మాఫియా అంటారు. ఎలాన్ మస్క్, పీటర్ థీల్, రీడ్ హాఫ్మన్ ఈ మాఫియాలో సభ్యులే.

డీఎన్​ఏతో ఫొటోలు భద్రం!

ఓ జీవి డీఎన్​ఏతో సాంకేతిక రంగం సృష్టించిన అద్భుతాలెన్నో. అయితే, మరో అడుగు ముందుకేసి డీఎన్​ఏ ద్వారా దాదాపు పది వేల గిగాబైట్ల ఫొటోలు, వీడియోలు, ఈమెయిల్​ వంటి డిజిటల్​ సమాచారాన్ని భద్రపరచనున్నారు శాస్త్రవేత్తలు.

వంతెన కట్టే డ్రోన్లు...

వంతెన కట్టే డ్రోన్లు...

స్విట్జర్లాండ్‌లో అద్భుతమైన రెండు క్వాడ్రోకాప్టర్లు తాళ్లతో ఓ వంతెనను నిర్మించాయి. తాడు సాయంతో దాదాపు 9 సెగ్మెంట్లు, 120 మీటర్ల పొడవైన వంతెనను సృష్టించాయి ఈ డ్రోన్లు.

నోకియా ప్రభంజనం..

నోకియా ప్రభంజనం..

ఇక మార్కెట్లో అత్యంత అధికంగా అమ్ముడుపోయిన నోకియా 1100 ఫిన్లాండ్​లో తయారైంది. ఈ ఫోన్లు​ ఇప్పటి వరకు దాదాపు 250 మిలియన్​ యూనిట్లు అమ్ముడయ్యాయి. చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రికల్ గాడ్జెట్​గా రికార్డు సృష్టించింది నోకియా 1100.

గూగుల్​ మొట్టమొదటి ట్వీట్​...

2009లో మొట్టమొదటి సారి ప్రఖ్యాత గూగుల్​ సంస్థ.. ట్విట్టర్​లో ఓ ట్వీట్​ పోస్ట్​ చేసింది. అదేంటంటే... "ఐ యామ్​ 01100110 01100101 01100101 01101100 01101001 01101110 01100111 00100000 01101100 01110101 01100011 01101011 01111001 00001010" అని. ఈ పోస్టు అర్థం తెలియక చాలా మంది తలలు పట్టుకున్నారు. కానీ, అది బైనరీ భాష అని తెలుసుకుని అనువదిస్తే... 'ఐ యామ్​ ఫీలింగ్​ లక్కీ' అని తెలిసింది.

స్మార్ట్​ వాటర్ బాటిళ్లు...

స్మార్ట్​ వాటర్ బాటిళ్లు...

బయటకు వెళ్లేటప్పుడు ఓ నీళ్ల బాటిల్​ తప్పనిసరిగా తీసుకెళ్తాం. కానీ, సమయానికి మందులు వేసుకోవాల్సిన వారు ఆ మాత్రలను ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. అందుకే, భవిష్యత్తులో మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వాటర్​ బాటిళ్లు రానున్నాయి. ఈ బాటిళ్లే మాత్రలను సమయానికి అందిస్తాయి.

అప్పుడలా.. ఇప్పుడిలా​

అప్పుడలా.. ఇప్పుడిలా​

ఓ ఐపాడ్ 50 మిలియన్ల ప్రేక్షకులను చేరుకోవడానికి కేవలం 3 సంవత్సరాల సమయం పట్టింది. కానీ, సాంకేతిక యుగం ఆరంభంలో పుట్టిన రేడియో ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడానికి 38 సంవత్సరాలు పట్టింది. టీవీకి దాదాపు 13 సంవత్సరాలు పట్టింది.

ఇదీ చదవండి:ఆవిష్కరణలే స్వావలంబనకు ఆధారం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details