తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఈ యాప్​తో ఒకేసారి 300 మందికి వీడియోకాల్

కరోనా దెబ్బతో వర్క్​ ఫ్రం హోమ్​ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్చువల్​ మీటింగ్​లకే సంస్థలన్నీ మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాలింగ్​ యాప్​లకు డిమాండ్​ ఎక్కువైంది. ముఖ్యంగా యూజర్లను ఆకట్టుకునేందుకు జూమ్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. అందుకే వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు మైక్రోసాఫ్ట్​ మెరుగైన ఫీచర్​తో వస్తోంది. దాని విశేషాలివే..

video calling news
వీడియో కాలింగ్​

By

Published : Jul 1, 2020, 12:36 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల హవా నడుస్తోంది. విపరీతంగా వినియోగదారులు పెరగడం వల్ల జూమ్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్​ వంటి ఎన్నో సంస్థలు యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే దూసుకెళ్తోన్న 'మైక్రోసాఫ్ట్‌ టీమ్స్'ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్​. ఇందులో భాగంగా ఒకేసారి 300 మంది వీడియో కాల్ ద్వారా కనెక్ట్​ అయ్యే సదుపాయాన్ని తెస్తున్నట్లు ప్రకటించింది.

300 మంది వీడియోకాలింగ్​...

సాధారణంగా వీడియో కాలింగ్​ యాప్​లలో పదుల సంఖ్యలోనే యూజర్లు కనెక్ట్​ అయ్యేందుకు అవకాశం​ ఉంటుంది. అయితే పెద్ద కళాశాల, సంస్థలను తీసుకుంటే ఎక్కువ మంది విద్యార్థులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న 250 మంది పరిమితిని మరో 20 శాతం పెంచింది. ఫలితంగా 300 మంది ఒకోసారి మాట్లాడే వర్చువల్​ మీటింగ్​లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది​. వెబినార్లు, సాధారణ చిట్​చాట్​​, మీటింగ్​లకు ఇది బాగా ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని సంస్థ మేనేజర్​ మైక్​ థాల్ఫ్సన్​ ప్రకటించారు. జూమ్​, గూగుల్​ మీట్​​లో ప్రస్తుతం 100 మంది వరకే ఏకకాలంలో కనెక్ట్​ అయ్యే వెసులుబాటు ఉంది.

ప్రభుత్వ అనుమతి రాగానే...

ప్రస్తుతం 250 లిమిట్​తోనే ఈ యాప్​ పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్​కు ప్రభుత్వం అనుమతి ఇస్తే దాన్ని 300 పెంచుతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో వివరాలు ప్రకటించలేదు. ఒక స్క్రీన్​లో ఒకేసారి 49 మంది కనిపించేలాగా ఈ యాప్​ను అభివృద్ధి చేస్తున్నారు. మిగతావారు స్లైడ్​ చేస్తే కనిపిస్తారు.

'మైక్రోసాఫ్ట్​ మీట్స్​'కు మార్చిలో 44 మిలియన్ల యూజర్లు ఉండగా.. జూన్​ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 75 మిలియన్​ మార్కుకు చేరింది.

వీడియో కాన్ఫరెన్స్‌ కోసం గూగుల్‌ మీట్‌, స్కైప్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌, సహా దేశీయంగా రూపొందించిన 'సే నమస్తే' యాప్​నూ ట్రై చేయొచ్చు. బాగా పేరు పొందిన 'జూమ్​' యాప్​ సురక్షితం కాదని ఇటీవల భారత ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది.

ఇవీ చూడండి:

  1. చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!
  2. శబ్దాలు నియంత్రించే ఏఐ ఫీచర్​తో 'గూగుల్​ మీట్​'
  3. 'జూమ్‌' వాడకంపై ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించింది?
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details