కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టులకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. పార్శిల్ సర్వీసులకే మొగ్గుచూపాలని ప్రభుత్వాలు సూచించినా వినియోగదారుల్లో ఎక్కడో భయం. వండేటప్పుడు చేతులు కడుక్కున్నారా? ప్యాకింగ్ సమయంలో పరిశుభ్రత పాటించారా? అనే అనుమానాలు రాకమానవు.
చేతులు 20 సెకన్ల పాటు సబ్బుతో కడుక్కుంటేనే క్రిములు పోతాయని ఇప్పటికే స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ). అయితే జపాన్‌లో ఈ నిబంధనను కొందరు పెడ చెవిన పెట్టడం వల్ల మళ్లీ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఓ ఐటీ సంస్థ ఫుజిట్సూ.. కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్)తో కూడిన మానిటర్‌ను తయారు చేసింది.
ఇది హెల్త్‌కేర్ సంస్థలు, హోటళ్లు, ఫుడ్ పరిశ్రమలు, పలు సంస్థల్లో వర్కర్ల చేతులను మానిటైజ్ చేసేందుకు ఉపయోగపడనుంది. చేతులు సరిగ్గా కడగకపోయినా, సబ్బు వాడకపోయినా చేప్పేస్తుంది.