వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ల వినియోగం ఇటీవల బాగా పెరిగిన నేపథ్యంలో రిలయన్స్ జియో కూడా ఈ తరహా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 'జియో మీట్' పేరుతో వీడియో కాలింగ్ యాప్‌ను గురువారం అధికారంగా లాంచ్ చేసింది. ఇది జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లో ఇది ఉచితంగా అందుబాటులో ఉంది.
జియో మీట్‌తో ఏకకాలంలో 100 మంది మీటింగ్‌లో పాల్గొనవచ్చు. ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. హెచ్డీ క్వాలిటీతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. మీటింగ్‌లకు పాస్‌వర్డ్‌తో భద్రత, జూమ్ తరహాలోనే వెయిటింగ్ రూమ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ ద్వారా కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. మల్టీ డివైజ్ లాగిన్నూ ఈ యాప్ సపోర్ట్ చేయనుంది. ఐదు డివైజ్‌లలో లాగిన్ అయి వాడుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్, సేఫ్ డ్రైవిండ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ప్రత్యేకతలు..