ఆన్‌లైన్‌లో సమావేశాలు నిర్వహించేందుకు ఉపయోగించే వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫాం గూగుల్ మీట్. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మీట్‌లో కొత్తగా నాలుగు ఫీచర్లు అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవలె గూగుల్ ప్రకటించింది. వాటిలో ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్.
వేర్వేరు ప్రదేశాల్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వివిధ రకాలైన శబ్దాలు వస్తుంటాయి. ఇంట్లో అయితే పిల్లలు, పెంపుడు జంతువులు, కీబోర్డు శబ్దాలు వంటివి తరచుగా వింటుంటాం. ఇక మీదట అటువంటి అంతరాయాలను నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ నిరోధిస్తుందని గూగుల్ తెలిపింది. ఇది బహిరంగ ప్రదేశాల్లో కూడా బాగా పనిచేస్తుందని పేర్కొంది.
ముందస్తుగా ఈ ఫీచర్‌ని వెబ్, జీ సూట్ ఎంటర్‌ప్రైజ్, జీ సూట్ ఎంటర్‌ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు.