Top 5 Smartwatches 2021: జిత్తులమారి కరోనా మహమ్మారి 2021లో ప్రజల్ని ఎంతో భయపెట్టిందో.. గ్యాడ్జెట్‌లకు అంతే దగ్గరగా చేసింది! లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం కావడం, సమావేశాలకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫ్లామ్‌లను వాడటం, ఆరోగ్య సంరక్షణ, కొవిడ్ సమాచారం, వినోదం, విజ్ఞానంతో ఇలా అన్నింటికీ గ్యాడ్జెట్‌లను విరివిగా వాడారు. ఈ నేపథ్యంలోనే మొబైల్ నోటిఫికేషన్ల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రకాల సమాచారాన్ని చేరవేస్తుండటంతో స్మార్ట్‌వాచ్‌లకు ఈ ఏడాది డిమాండ్ కూడా భారీగానే పెరిగింది. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు దిగ్గజ కంపెనీలు వివిధ శ్రేణుల్లో స్మార్ట్‌వాచ్‌లు విడుదల చేశాయి. ఇందులో ఈ ఏడాది రూ.5 వేలలోపు ధరల్లో ఎక్కువ ఫీచర్లతో విడుదలైన ఆ టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల జాబితా మీ కోసం..
Xiaomi Mi Watch:
1.4 అంగుళాల TFT LCD డిస్‌ప్లే, 320x320 పిక్సెల్ రిజల్యూషన్‌తో షావోమి Redmi Watchనువిడుదల చేసింది. హార్ట్‌రేట్, స్లీప్ మానిటరింగ్, స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్, జీపీఎస్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్ సహా మొత్తం 11 రకాల స్పోర్ట్స్ మోడ్ ఫీఛర్లు ఇందులో ఉన్నాయి. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వాచ్ నీటిలో తడిచినా పాడవదు. ఇందులోని 230 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజులపాటు బ్యాక్‌అప్ ఉంటుంది. నోటిఫికేషన్స్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ధర రూ.3,999.
Realme Watch 2:
315 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.4 అంగుళాల కలర్ టచ్ స్క్రీన్ హై రిజల్యూషన్ డిస్‌ప్లేతో రియల్‌మీ వాచ్ 2 ఈ ఏడాది విడుదలైంది. ఐఓటీ స్మార్ట్ కంట్రోల్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, ఇంటలిజెంట్ రియల్ టైమ్ హార్ట్‌రేట్ మానిటర్, ఔట్-ఇన్ డోర్ 90 స్పోర్ట్స్ మోడ్ ఫీచర్లు వీటి ప్రత్యేకతలు. వాచ్ సాయంతో ఫోన్‌లో మ్యూజిక్, కెమెరా కంట్రోల్ చెయ్యొచ్చు. ధర రూ.3,499.
Playfit Slim: