Top 5 Hidden YouTube Features : ఆన్లైన్ వీడియో కంటెంట్‌లో యూట్యూబ్ రారాజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2005లో దీని బీటా వెర్షన్ రిలీజైంది. ఆ సమయంలో రోజూ దీన్ని 30 వేల మంది చూసేవారు. కానీ నేడు ప్రతి రోజూ 2.56 బిలియన్ యూజర్లు దీన్ని యాక్సెస్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో దాదాపుగా అన్ని విషయాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. పురాణాలు మొదలు, మోడ్రన్ లైఫ్‌స్టైల్ వరకు అన్ని వీడియోలు ఇందులో ఉంటాయి. చాలా మంది గంటలు, గంటలు యూట్యూబ్ చూస్తూ గడిపేస్తారు. అందువల్ల యూట్యూబ్ ఫీచర్లు గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ అందులో చాలా మందికి తెలియని హిడెన్ ఫీచర్లు ఎన్నో ఉంటాయి. వాటిలోని టాప్-5 బెస్ట్ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Gesturesతో మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్
- మన వేలుతో వీడియో ఎడమ లేదా కుడి వైపున, రెండు సార్లు నొక్కి వీడియోను 10 సెకన్లు ఫార్వార్డ్, బ్యాక్వార్డ్ చేసుకోవచ్చు. మూడు సార్లు ట్యాప్ చేస్తే 20 సెకన్లు, 4 సార్లు ట్యాప్ చేస్తే 30 సెకన్ల పాటు వీడియో ఫార్వార్డ్ లేదా బ్యాక్వార్డ్ అవుతుంది. అంతేకాదు, వీడియో ఎంత సేపు స్కిప్ కావాలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings > General > Double-tap to seek పై ప్రెస్ చేసి స్కిప్ టైమ్‌ను (5, 10, 15, 20, 30, లేదా 60 సెకన్లు) వరకు సెట్ చేసుకోవచ్చు.
- రెండు వేళ్లలో రెండు సార్లు నొక్కడం ద్వారా వీడియోలోని నెక్ట్స్ ఛాప్టర్‌కు వెళ్లవచ్చు. ఇది వివిధ సెక్షన్లుగా రూపొందించిన వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది.
- వీడియోలో ఏ ప్రాంతంలోనైనా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే, ఆటోమేటిక్‌గా అది 2x స్పీడ్‌తో ప్లే అవుతుంది.
- వీడియో పాజ్ చేసి ఉన్నప్పుడు, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే, కుడికి లేదా ఎడమ వైపునకు స్వైప్ చేయవచ్చు. దీని వల్ల మనం అనుకున్న డ్యురేషన్ వద్దకు సులభంగా వెళ్లొచ్చు.
- Swipe down, Swipe up చేస్తే వీడియో Minimize, Maximize అవుతుంది.
- వీడియో ప్లే అవుతున్నప్పుడు రెండు వేళ్లతో పించ్ చేయడం వల్ల దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయవచ్చు.
- పుల్ స్క్రీన్ మోడ్‌లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మన ఫింగర్తో Swipe up చేస్తే, మనం చూస్తున్న కంటెంట్‌కు సంబంధించిన వీడియోల లిస్టు కనబడుతుంది. అందులో మనకు నచ్చిన వీడియోని ఎంపిక చేసుకుని చూడవచ్చు.
2. యూట్యూబ్ యూసేజ్ టైమ్
మనకు తెలియకుండానే యూట్యూబ్‌లో గంటలు గంటలు గడుపుతుంటాం. దీని వల్ల చాలా సమయం వృథా అవుతుంది. దీనిని నివారించడానికి 'యూట్యూబ్ వాచ్ టైమ్'ను సెట్ చేసుకోవచ్చు. అదెలా అంటే, ముందుగా మీరు Settings > General> Remind me to take a break అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో ఎంతసేపటి వరకు బ్రేక్ తీసుకోవాలో సెట్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 5 నిమిషాల నుంచి గరిష్ఠంగా 23 గంటల 55 వరకు ఈ బ్రేక్ టైమ్‌ను సెట్ చేసుకోవచ్చు. తరువాత OK ప్రెస్ చేయాలి. అంతే నిర్ణీత సమయం అయిన తరువాత మీకు యూట్యూబ్ నుంచి మీకు టైమ్ బ్రేక్ నోటిఫికేషన్ వస్తుంది.
యూట్యూబ్‌లో మనం నిద్రపోవాల్సిన సమయాన్ని గుర్తు చేయడానికి కూడా ఒక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందుకోసం మీరు Settings > General> Remind me when it's bedtime break అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.
3. ప్రైవసీ ప్రొటక్షన్
మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు, గతంలో చూసిన వీడియోలకు సంబంధించిన కంటెంట్ వస్తుంది. మీరు మాత్రమే ఆ ఖాతా వాడినప్పుడు ఏం కాదు కానీ, దాన్ని ఇతరులు వినియోగించినప్పుడు లేదా మీ ఫోన్లో ఎవరైనా యూట్యూబ్ చేస్తున్నప్పుడు, ఏదైనా అనుకోని వీడియోలు వస్తే అంతే సంగతులు. ఇలా జరగకూడదనుకుంటే, కింద తెలిపిన రెండు పద్ధతులు ఉపయోగించాలి.
1వ పద్ధతి:యూట్యూబ్‌లో Incognito మోడ్‌ని ఆన్ చేయడం. దీని వల్ల మీ అకౌంట్లోకి సైన్ఇన్ కాకుండానే వీడియోలు చూడవచ్చు. దీని వల్ల మీరు చూసే కంటెంట్ యూట్యూబ్ హిస్టరీలో నమోదు అవ్వదు. దాన్నెలా ఉపయోగించాలంటే, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత, అకౌంట్ బటన్ని (You tab) ప్రెస్ చేస్తే, అకౌంట్ నేమ్ కింద Turn on Incognito అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే incognito మోడ్ ఆన్ అవుతుంది. పని పూర్తి అయిన తరువాత Turn Off Incognito నొక్కి దానిని ఆఫ్ చేసుకోవచ్చు.