Reduce phone usage: ప్రస్తుత రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే గడవదు. అంతలా ఫోన్లకు బానిసలుగా మారిపోయాం. అయితే ఫోన్‌ను దూరం పెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఫోన్ చేతికి అందేంత దూరంలో పెట్టొద్దు. గదిలో ఓ మూలన దూరంగా పెట్టండి. ముఖ్యంగా.. నిద్ర లేవగానే ఫోన్‌ని స్క్రోల్ చేస్తూ కూర్చునే వారికి ఇది బాగా పని చేస్తుంది. రోజులో ఏవైనా నిర్ణీత సమయాల్లోనే (పాకెట్స్ ఆఫ్ టైమ్) గ్యాడ్జెట్‌లను యాక్సెస్ చేసేలా షెడ్యూల్ చేసుకుంటే మంచిది.
రంగులొద్దు..
తెరల్ని నలుపు, తెలుపులోకి మార్చేయాలి. అంటే.. 'గ్రేస్కేల్'లోకి అన్నమాట. దీంతో ఫొటోలు, వీడియోలు, విజువల్స్ ఏవైనా ఎక్కువ సేపు చూసేందుకు ఆసక్తిగా అనిపించదు. దీంతో ఆటోమేటిక్‌గా స్క్రీన్‌టైమ్ తగ్గిపోతుంది. 'మ్యూట్ ద కలర్స్' నినాదాన్ని డిజిటల్ లైఫ్‌లోకి తీసుకొస్తే మంచిది.