ప్రస్తుత జనరేషన్లో హ్యాకింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఓ చిన్న లింక్ నొక్కితే చాలు మన డేటా అంతా ఇట్టే కాజేస్తారు సైబర్ నేరగాళ్లు. మన డేటా భద్రతకు శాశ్వత పరిష్కారం లేకపోయినప్పటికి ఈ చిన్ని చిట్కాలతో తాత్కాలికంగా భద్రపరుచుకోవచ్చు. అది ఎలా అంటే..
చాట్ ఎన్‌క్రిప్షన్‌ను చెక్ చేసుకోవడం..
సాధారణంగా అన్ని వాట్సాప్ చాట్‌లు డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అయ్యుంటాయి. అయినా సరే ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని పంపించాలి.
- ఎన్‌క్రిప్షన్‌ను వెరిఫై చేయడానికి, చాట్ విండోలో కాంటాక్ట్ పేరుపై ట్యాప్ చేసి, ఆపై ఎన్‌క్రిప్షన్‌పై ట్యాప్ చేయండి.
టూ ఫ్యాక్టర్ అథెెంటికేషన్..
మన డేటాను వేరొకరు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే ఈ టూ ఫ్యాక్టర్ అథెెంటికేషన్ను మన అకౌంట్‌కు జత చేయడం ఎంతో అవసరం.
టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయడానికి ఈ స్టెప్స్ ఉపయోగించండి :
- వాట్సాప్ మెనూలోకి వెళ్లాలి.
- ఆ తర్వాత సెట్టింగ్స్‌లో అకౌంట్ మెనూను ఓపెన్ చేస్తే అక్కడ టూ ఫ్యాక్టర్ అథెెంటికేషన్ ఆఫ్షన్‌ను ఎనేబుల్ చేయండి.
సెక్యూరిటీ నోటిఫికేషన్లు ఆన్ చేయడం..
ఇప్పుడున్న చాట్‌ను ఏదైనా కొత్త డివైజ్ ద్వారా యాక్సెస్ చేస్తే మన ఫోన్‌కు ఓ కొత్త సెక్యూరిటీ కోడ్ వస్తుంది. అంతేకాకుండా సెక్యూరిటీ కోడ్ మారినప్పుడల్లా ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది.
- దీన్ని ఎనేబుల్ చేయడానికి, వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- అకౌంట్ మెనూ ఓపెన్ చేసి అందులో సెక్యూరిటీ నోటిఫికేషన్‌లోకి వెళ్లాలి.
- ఆపై 'షో సెక్యూరిటీ నోటిఫికేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
క్లౌడ్ బ్యాకప్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేయండి
గూగుల్ డ్రైవ్‌లో ఉన్న వాట్సప్ డేటా డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉండడు. దీని వల్ల మన చాట్‌కు భద్రత ఉండదు. అందుకోసం మనం చాట్ బ్యాకప్ పెట్టే ముందు దాన్ని ఎన్‌క్రిప్ట్ చేయాలి. అది ఎలా అంటే.
- వాట్సాప్ సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
- అందులో చాట్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- చాట్‌లో బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆపై బ్యాకప్ ఎన్‌క్రిప్షన్‌ను టర్న్ ఆన్ చేస్తే దాని ద్వారా మన చాట్‌ను పాస్‌వర్డ్‌తో లాక్ చేసుకోవచ్చు.
తెలియని లింక్స్‌తో జర భద్రం..
ఇప్పటి కాలంలో వాట్సాప్‌లో విరివిగా షేర్ అవుతున్న లింక్స్ వల్ల ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకున్న వారిని చూస్తుంటాం. అంతే కాకుండా వచ్చిన ప్రతి లింక్ మంచిదో.. కాదో అన్న విషయం మనకు తెలియదు. అందుకనే వాటిని ఓపెన్ చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్లిక్ చేయకుండా నిరోధించడానికి లింక్‌ను కాపీ చేసి నార్తన్ సేఫ్ వెబ్, ఫిష్ ట్యాంక్ లాంటి ఇతర సైట్‌లలో చెక్ చేయండి. ఈ అలవాటు ద్వారా మీరు హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయడం మానేస్తారు.