ఎక్కడికైనా ప్రయాణిస్తున్న సమయంలో పాటలు వినాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం సాధారణమైపోయింది. సంగీత ప్రియులకైతే ఇయర్ ఫోన్స్ లేకపోతే ఇక రోజు గడవదన్నట్లు ఉంటుంది. ఒకప్పుడు వైర్‌తో వచ్చే ఈ ఇయర్‌ఫోన్స్ ఇప్పుడు వైర్‌లెస్‌గా అందుబాటులోకి వచ్చాయి.
అయితే ఈ ఇయర్ బడ్స్ చిన్నగా ఉండటం వల్ల తరచూ వాటిని పోగొట్టుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా ఓ చిన్నపాటి కేస్‌లో భద్రపరుచుకోవాలి. అది కూడా పోయే ప్రమాదముంది. ఇయర్ బడ్స్ కేస్‌ను ప్రతి చోటుకు తీసుకెళ్లేందుకు ఇష్టపడని వారి కోసం ఓ స్మార్ట్ వాచ్ కంపెనీ వినూత్నంగా ఆలోచించింది. "హువావే వాచ్ బడ్స్" అనే ఓ డివైజ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.
ETV Bharat / science-and-technology
స్మార్ట్ వాచ్లోనే ఇయర్ బడ్స్.. కేస్‌తో పనిలేదిక.. ఏం ఐడియా గురూ!
చూడటానికి అది స్మార్ట్ వాచ్లాగే కనిపిస్తుంది. కాని దాని కింద ఉన్న ఓ బటన్ నొక్కితే చాలు వెంటనే ఆ డయల్ ఓపెన్ అయ్యి బుల్లి ఇయర్ బడ్స్ కనిపిస్తాయి. ఇలా ఇయర్ బడ్స్ కేస్లా ఉపయోగపడే ఈ టూ ఇన్ వన్ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం నెట్టింట హలచల్ చేస్తోంది.
చూడటానికి అది స్మార్ట్ వాచ్లాగే కనిపిస్తుంది. కాని దాని కింద ఉన్న ఓ బటన్ నొక్కితే చాలు వెంటనే డయల్ ఓపెన్ అవుతుంది. బుల్లి ఇయర్ బడ్స్ కనిపిస్తాయి. ఇలా ఇయర్ బడ్స్ కేస్లా ఉపయోగపడే ఈ టూ ఇన్ వన్ స్మార్ట్ వాచ్ ప్రస్తుతం నెట్టింట హలచల్ చేస్తోంది. చైనాలో స్మార్ట్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న హువావే అనే సంస్థ ఈ ఐడియాతో ముందుకొచ్చింది.
హూవావే సొంత ఓఎస్‌తో ఆపరేట్ అయ్యే ఈ స్మార్ట్ వాచ్‌ను డిసెంబర్ 2న లాంచ్ చేస్తామని తెలిపిన సంస్థ.. కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసింది.