ల్యాప్‌టాప్.. ప్రస్తుత కాలంలో దీని ఉపయోగం పెరిగింది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు, విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినేందుకు... ఇలా చాలా అవసరాలను కంప్యూటర్ అవసరం ఉంటోంది. ల్యాప్‌టాప్‌కు ఉన్న అనుకూలతల దృష్ట్యా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
రూ.15వేల నుంచి లక్షల రూపాయాల వరకు ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఫీచర్లు, హార్డ్‌వేర్‌ను బట్టి వీటి ధరల్లో మార్పు ఉంటుంది. బడ్జెట్‌తో పాటు ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. సాంకేతికంగా కూడా వీటిని కొనుగోలు చేసే సమయంలో పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
వీడియో ఎడిటింగ్, గేమ్స్ లాంటి హై ఎండ్ ఉపయోగం నుంచి మొదలుకొని.. నెట్ బ్రౌజింగ్ లాంటి చిన్న చిన్న కార్యకలాపాలను ల్యాప్‌టాప్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. హై ఎండ్ ఉపయోగం ఉన్న వారు మంచి దానిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో చిన్న చిన్న పనులు కోసం అయితే తక్కువ స్థాయిలో తీసుకున్నా సరిపోతుంది.
ప్రాసెసర్
ల్యాప్‌టాప్ ముఖ్యమైన భాగాల్లో ప్రాసెసర్ అనేది చాలా కీలకం. ఇది ఎంత ఎక్కువ స్పీడ్ ఉండే అంత మంచిది. మంచి ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తుంది. ఇంటెల్, ఏఎండీలు కంప్యూటర్ ప్రాసెసర్లను తయారు చేస్తున్న ప్రధాన కంపెనీలు. ఇంటెల్‌లో ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఉన్నాయి. వీటిలో జనరేషన్ మారుతుంటుంది. ప్రస్తుతం 11వ జనరేషన్ ప్రాసెసర్లను ఇంటెల్ విడుదల చేసింది. ఏఎండీ లో కూడా పలు రకాల ప్రాసెసర్లు ఉన్నాయి. ఇంటెల్ ప్రాసెసర్లను తీసుకుంటే ఐ7 హెవీ టాస్క్‌లను హ్యాండిల్ చేయగలదు. అదే సమయంలో ఐ3 తక్కువ టాస్క్‌లను హ్యాండిల్ చేయగలదు.
మెమోరీ
రోజు వారీ ఉపయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మంచి మెమోరీ సరిపడేంత ఉండాలి. ఒకప్పుడు హెచ్డీడీ(హార్డ్ డిస్క్ డ్రైవ్) మెమోరీలు మాత్రమే ల్యాప్‌టాప్‌లలో వచ్చేవి. ఇప్పుడు ఎస్ఎస్డీ(సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు వస్తున్నాయి. హెచ్డీడీ అనేది డిస్క్ ఆధారిత టెక్నాలజీ. ఎస్ఎస్డీలో పోల్చితే రీడ్, రైట్స్పీడ్లు తక్కువగా ఉంటాయి. ఎస్ఎస్డీ అనేది మెమోరీ కార్డ్‌ను పోలి ఉంటుంది. ఇందులో రీడ్, రైట్‌స్పీడ్ లు ఎక్కువగా ఉంటాయి. హెచ్డీడీ కంటే ఎస్ఎస్డీని ఎంచుకోవటం ఉత్తమం. ఎస్ఎస్డీలో సాంకేతికలపరంగా తేడా ఉంది. వీటిని గమనించి ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి.
ర్యామ్
మల్టీ టాస్కింగ్ కోసం ఇది చాలా ముఖ్యమైనది. ర్యామ్ తక్కువగా ఉన్నట్లయితే ఒకే సారి ఎక్కువ అప్లికేషన్లను ఉపయోగించే వీలు ఉండదు. వీడియో ప్రాసెసింగ్ లాంటి వాటి కోసం ల్యాప్‌టాప్ వాడుతున్న వారు అయితే తప్పకుండా ఎక్కువ ర్యామ్ తీసుకోవాలి. చిన్న చిన్న అవసరాల కోసం తీసుకునే వారు అయితే తక్కువగా ఉన్నది అయినా సరిపోతుంది. అన్నీ స్థాయిల్లో ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా 8 జీబీ, 16 జీబీ ర్యామ్ ఉన్నవే విక్రయం అవుతున్నాయి.
బ్యాటరీ