అంతరిక్ష యానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్ష వాహక నౌక "యూనిటీ -22" ను ప్రయోగించనున్నట్లు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్(Richard Branson)తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల(Shirisha Bandla).. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి (Vice President of the Virgin Galactic) హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శిరీష కుటుంబం.. వాషింగ్టన్లో స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్‌లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్‌లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.