కరోనా కష్టకాలంలో పలు యాప్స్ ఎంతో మేలు చేస్తున్నాయి. అన్నిరకాలుగా ఉపయోగపడే సర్వీసులు అందిస్తున్నాయి. ఇవి ఫోన్‌లో ఉంటే ఆపత్కాలంలో మనకు, సన్నిహితులకు మంచిది.
ట్రూ కాలర్- నిజమైన సేవ
కాలర్ ఐడీ సర్వీస్ ప్రొవైడర్ 'ట్రూ కాలర్' దేశంలోని మొత్తం ఆసుపత్రుల జాబితాను సిద్ధం చేసింది. యాప్‌లోని మెనూ లేదా డైలర్ విభాగంలోకి వెళ్తే ఆసుపత్రుల వివరాలు, అక్కడి కరోనా వైద్య సౌకర్యాలేంటో తేలికగా తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు, చిరునామా సైతం అందుబాటులో ఉంచారు. ఈ సమాచారం అంతా ప్రభుత్వ డేటాబేస్ నుంచి సేకరించాం అంటోంది ట్రూ కాలర్..
ఎస్ రైడ్.. మీకు తోడుగా
ఇరవై లక్షల యూజర్లు ఉన్న కార్ పూలింగ్ యాప్ ఎస్ రైడ్. 'ఎస్ నైబర్' పేరుతో కొత్త సర్వీసు ప్రారంభించింది. కొవిడ్ సమాచారం, పరీక్షల వివరాలు, ఆహారం, వైద్యం, మందులు, నిత్యావసరాలు, ఆసుపత్రుల వివరాలు.. ఇలా ప్రతీది పంచుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీన్ని ప్రారంభించిన కొద్ది సమయంలోనే యూజర్లు వందశాతం రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారు అంటున్నారు ఎస్ రైడ్ వ్యవస్థాపకుడు లక్ష్య ఝా.
ప్రేమతో.. ట్రూలీ మ్యాడ్లీ