తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

టెస్లా నుంచి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌- ధర ఎంతంటే? - Tesla smartphone price

Tesla smartphone news: టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలో టెస్లా నుంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ పేరేంటి? ధరెంత?ఎలాంటి ఫీచర్లుంటాయి, ఎప్పుడు విడుదల చేస్తారు వంటి వాటి గురించి నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు. మరి టెస్లా స్మార్ట్‌ఫోన్‌ వివరాలేంటో చూద్దాం.

Tesla Smartphone, టెస్లా స్మార్ట్‌ఫోన్
టెస్లా నుంచి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌

By

Published : Dec 22, 2021, 5:14 PM IST

Tesla smartphone news: టెస్లా (Tesla) కంపెనీ పేరు వినగానే మనకు ఎలక్ట్రిక్‌ కార్లు, ఎలాన్‌ మస్క్‌ గుర్తొస్తారు. అంతేకాదు స్పేస్‌ ఎక్స్‌ పేరుతో మస్క్ అంతరిక్ష పరిశోధన సంస్థను కూడా నెలకొల్పారు. ఇప్పటికే ఈ సంస్థ ఫాల్కన్‌ రాకెట్ల ద్వారా స్టార్‌ లింక్ శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వీటితోపాటు మస్క్‌ అత్యంత వేగంగా ప్రయాణం చేయగల సౌలభ్యమున్న హైపర్‌లూప్‌ సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా మస్క్‌ స్మార్ట్‌ఫోన్ తయారీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారట. త్వరలో టెస్లా కంపెనీ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో టెస్లా స్మార్ట్‌ఫోన్‌పై మార్కెట్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫోన్‌ పేరేంటి? ధరెంత?ఎలాంటి ఫీచర్లుంటాయి, ఎప్పుడు విడుదల చేస్తారు వంటి వాటి గురించి నెటిజన్లు చర్చించుకోవడం ప్రారంభించారు. మరి టెస్లా స్మార్ట్‌ఫోన్‌ గురించి వివరాలేంటో చూద్దాం.

Tesla smartphone Model Pi

టెస్లా కంపెనీ విడుదల చేయనున్న స్మార్ట్‌ఫోన్‌ను మోడల్‌ పై/పీ (Model Pi/P) అని పిలుస్తారట. అయితే దీనిపై టెస్లా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ దాదాపు ఈ పేరు ఖాయమని నెట్టింట్లో టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. టెస్లా గతంలో కూడా ఎన్నో భిన్న ఉత్పత్తులను విడుదల చేసింది. సైబర్‌ ట్రక్‌, పిల్లల్ల కోసం ఎలక్ట్రిక్‌ వెహికిల్‌, టెస్లా గొడుగు, స్టీల్‌తో చేసిన విజిల్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అదే తరహాలో టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tesla phone features

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టెస్లా గేమింగ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఫోన్‌ పై భాగంలో నేవీ బ్లూ కలర్‌, కింద స్కై బ్లూ రంగులతోపాటు, ఫోన్‌ వెనుకవైపు టెస్లాకు గుర్తుగా 'T' అక్షరం లోగో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో రెండు కెమెరాలుంటాయట. స్నాప్‌డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుందని సమాచారం. అలానే 6.5 అంగుళాల 4K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంటుందట. 2 టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ర్యామ్‌, ఓఎస్‌ గురించి వివరాలు తెలియాల్సివుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫోన్‌ను వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

Tesla smartphone price

టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉంటుంది. భారత మార్కెట్లో ప్రస్తుతం ఈ ధరలో ప్రీమియం కేటగిరీలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌21, వన్‌ప్లస్‌ 9 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, వివో ఎక్స్‌70 ప్రో ప్లస్‌, ఐఫోన్ 13 మోడల్స్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి:Power Banks: రూ. 1000లోపు ది బెస్ట్ పవర్‌ బ్యాంక్స్‌ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details