తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

చంద్రున్ని సిగ్నల్ అనుకుంది.. 'టెస్లా' కారు వీడియో వైరల్! - టెస్లా మూన్ ట్రెండింగ్ న్యూస్

ఆకాశంలో ఉన్న చంద్రుడిని ట్రాఫిక్ లైట్ అనుకొని ఆగిపోతామా? ఊరుకోండి సార్.. సిగ్నల్​ పడితేనే వేచిచూసే సమయమూ, ఓపికా లేవంటారా? కానీ.. పాపం టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు మాత్రం గందరగోళానికి గురైనట్లుంది. చంద్రుణ్ని చూసి సిగ్నల్ లైట్ అనుకొని ఆగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

tesla car moon attack
చంద్రుణ్ని.. ట్రాఫిక్ సిగ్నల్ అనుకొని స్లో అయిన కార్!

By

Published : Jul 28, 2021, 3:25 PM IST

టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారులో ప్రయాణం చాలామందికి ఓ కల. అలాంటి అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న జోర్డాన్ నెల్సన్ అనే వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. తన కారు వేగం ఒక్కసారిగా తగ్గిపోవడం గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో పది లక్షల వ్యూస్​తో దూసుకెళ్తోంది.

నెల్సన్​కి ఏం జరిగింది?

వేగంగా వెళ్తున్న తన కారు పొరపాటున చంద్రుడిని ట్రాఫిక్ సిగ్నల్​లోని ఎల్లో లైట్​గా భావించిందని నెల్సన్ పేర్కొన్నాడు. దీనితో అకస్మాత్తుగా కారు వేగం తగ్గిపోవడాన్ని గమనించాడు. ఈ మొత్తాన్ని వీడియోగా చిత్రీకరించిన అతను.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్​లో షేర్ చేశాడు. అయితే ఈ వీడియోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ నుంచి ఏ విధమైన స్పందన రాలేదు.

"ఆటోపైలట్ వ్యవస్థను మోసగించాలని టెస్లా బృందం అనుకోవచ్చు. కానీ.. చంద్రుణ్ని చూసి ట్రాఫిక్ లైట్ అనుకొని స్లో అయింది."

--జోర్డాన్ నెల్సన్

ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆటో పైలట్ వ్యవస్థ సురక్షితమేనా? అని ప్రశ్నిస్తున్నారు.

  • 'ఓహ్ మై గాడ్ మీరు మరీ ఘోరంగా ఉన్నారే..! జుమాన్జీ లాగే వెంటాడినట్లు అనిపిస్తోంది' అని ఒకరు కామెంట్ చేశారు.
  • 'మానవులు ఎన్ని తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి. మనం సగం కంటే తక్కువ సాంకేతికతనే జయించాం. వాస్తవానికి ఇవి అంతగా సురక్షితం కాదు' అంటూ రాబర్ట్ టి. బ్రౌన్ అనే వ్యక్తి రాసుకొచ్చారు.
  • రెండు చంద్రులు ఉన్న గ్రహాలపై ఇదే సమస్య. అంగారకునిపై(మార్స్) కాలనీలు నిర్మించే ప్రణాళికలకు ఈ చర్య ఏ విధంగా ఉపయోగపడుతుంది? అని మెగ్ అనే వ్యక్తి కామెంట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details