ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్.. యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ప్రకటించింది. టెలిగ్రామ్‌లో 1000 మందితో వీడియో కాల్ సహా వీడియో మెసేజ్‌లను పంపేలా మార్పులు చేసింది. సౌండ్‌తో స్క్రీన్ షేరింగ్, ఒన్-ఆన్-ఒన్ కాల్స్ లాంటి సదుపాయాలు కల్పించింది. ఈ మధ్య వాట్సాప్‌లో ప్రైవసీ పాలసీలో మార్పులు రావడం వల్ల ఆ యూజర్లలో చాలామంది టెలిగ్రామ్‌ను సురక్షితంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
భూమి మీద ఉన్న మానవాళి మొత్తం ఒకేసారి గ్రూప్ కాల్ మాట్లాడే విధంగా భవిష్యత్‌లో యాప్ మార్పులు చేయనున్నామని టెలిగ్రామ్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒకేసారి 1000 మంది వీడియో కాల్ సదుపాయం సహా 30 మంది తమ కెమెరాతో పాటు స్క్రీన్‌ను ఇతరులతో షేర్ చేసుకునే అవకాశాన్ని ఇందులో కల్పించారు. ఆన్లైన్ క్లాసులతో పాటు సెమినార్స్, వీడియో కాన్సర్ట్స్లలో ఎంతోమంది ప్రేక్షకులు పాల్గొనేందుకు ఇది సహకరిస్తుంది.
వీడియో మెసేజ్‌లు
టెలిగ్రామ్‌లో వీడియో మెసేజ్ ఫీచర్‌నూ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల వీడియోలను వేగంగా పంపిడం సహా గ్యాలరీకి యాడ్ చేయకుండానే ఏదైనా వీడియోను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. దాని కోసం చాటింగ్ బాక్స్‌లో రికార్డింగ్ బటన్‌పై క్లిక్ చేసి సరి. మీరు పంపిన ఆ వీడియో గ్యాలరీలో సేవ్ కాదు.