telegram premium features: ఆధునిక మెసేజింగ్ ప్రపంచంలో వాట్సాప్, టెలిగ్రామ్ అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆదరణ సంపాదించుకున్నాయి ఈ రెండు యాప్స్. ఉచితంగా సేవలు అందించడం వల్ల ఈ యాప్స్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఆ ఫలితంగానే వీటికి అంత క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు టెలిగ్రామ్ రూటు మారుస్తోంది. ప్రీమియం వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లన్నీ ఉచితంగానే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మరికొన్ని అధునాతన ఫీచర్లు తీసుకొచ్చి వాటికి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయనుందని సమాచారం. ఈ పద్ధతి విజయవంతమైతే వాట్సాప్ సైతం ఇదే దారిలో వెళ్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
telegram premium price: ప్రస్తుతం టెలిగ్రామ్ ఐఓఎస్ బీటా వెర్షన్ (8.7.2) విడుదలైంది. ఇందులో కొత్తకొత్త ఎమోజీలు, రియాక్షన్స్, స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రీమియం వెర్షన్లోనివేనని టాక్ వినిపిస్తోంది. వీటిని ఉపయోగించాలంటే టెలిగ్రామ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ లాగిన్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ప్రీమియంకు సంబంధించిన కొత్త ఫీచర్లు రాలేదు. ఎప్పుడు వస్తుందనే విషయంపైనా స్పష్టత లేదు. అయితే, ప్రీమియం వెర్షన్‌కు ఛార్జీలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.
whatsapp vs telegram: మెసేజింగ్ యాప్‌ల విషయంలో వాట్సాప్, టెలిగ్రామ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఫంక్షనాలిటీ, ఫీచర్స్ విషయంలో టెలిగ్రామ్.. వాట్సాప్‌కు అందనంత ఎత్తులో ఉంది. అయితే, సులువుగా ఉపయోగించుకునే వీలున్న వాట్సాప్ మార్కెట్లో లీడింగ్ మెసేజింగ్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే, టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్ విజయవంతమైతే.. వాట్సాప్ సైతం సబ్స్క్రిప్షన్ల విషయంపై ఆలోచన చేసే అవకాశం ఉందని సమాచారం.