ప్రముఖ మెసెంజర్ యాప్ టెలిగ్రామ్.. తన ఛానెళ్లలో అపరిమిత లైవ్ వాయిస్ చాట్ సెషన్‌లు నిర్వహించుకునేందుకు వీలుగా 'వాయిస్ చాట్స్ 2.0' పేరిట సరికొత్త ఫీచర్ను పరిచయం చేసింది. వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల గోప్యతకు భంగం కలగకుండా ఈ ఫీచర్ని రూపొందించామని కంపెనీ తెలిపింది.
ఈ ఫీచర్తో ప్రత్యక్ష వాయిస్ చాట్ సెషన్లను రికార్డ్ చేసుకోవచ్చు. సెషన్ ముగియగానే రికార్డు అయిన ఫైల్స్ ఆటోమేటిక్గా మన ఫోన్/కంప్యూటర్లో సేవ్ అవుతాయి. అంతేగాక.. ఛానెల్‌ళ్లలో అపరిమితంగా ప్రత్యక్ష వాయిస్ చాట్ సెషన్‌లను సైతం నిర్వహించుకోవచునేలా రూపొందించారు. 2020 డిసెంబర్‌లో ప్రారంభించిన టెలిగ్రామ్ గ్రూపులకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది.
మరికొన్ని..