Whatsapp Features 2023 : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకువస్తోంది. తాజాగా అలాంటి మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో హై క్వాలిటీ వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ గురించి పూర్తి సమాచారం ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
త్వరలో వాట్సాప్‌లో హై క్వాలిటీ వీడియోలు షేర్ చేసుకోవచ్చని సమాచారం. ఈ మేరకు WaBetaInfo తమ నివేదికలో పేర్కొంది. ఈ ఫీచర్ ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని సమాచారం. ఈ ఫీచర్లో భాగంగా హై క్వాలిటీ వీడియోలను షేర్ చేసుకోవడానికి.. వాట్సాప్ డ్రాయింగ్ ఎడిటర్లో ఒక బటన్ ఇవ్వనున్నారు. వీడియోలను షేర్ చేయాలనుకున్నప్పుడు ఆ బటన్‌ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
Whatsapp High Quality Video Send : హై క్వాలిటీ ఫొటో ఫీచర్ లాగానే.. వీడియోను షేర్ చేసేటప్పుడు 'మీడియా క్వాలిటీ'అనే పాప్అప్ ఓపెన్ అవుతుంది. అందులో 'స్టాండర్ క్వాలిటీ', 'హెచ్డీ క్వాలిటీ' అనే డీఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సాధారణంగా స్టాండర్డ్ క్వాలిటీ.. వాడితే తక్కువ స్టోరేజ్ స్పేస్ తీసుకుని.. తొందరగా సెండ్ అవుతుంది. యూజర్ ఇంకా ఎక్కువ నాణ్యత కలిగిన వీడియోలను షేర్ చేయాలనుకున్నప్పుడు.. 'హెచ్డీ క్వాలిటీ' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫీచర్ ఉపయోగించి వీడియోలను పంపినప్పుడు.. చాట్ విండోలో దానికి అటోమేటిక్‌గా హైక్వాలిటీ వీడియో ట్యాగ్ వస్తుంది. అయితే, వీడియోలను ఒరిజినల్ క్వాలిటీలో పంపించలేము. ఎందుకంటే.. వీడియో కచ్చితంగా ఎంతో కొంత కంప్రెస్ అవుతుంది. అయినా.. వీడియో నాణ్యత బాగానే ఉంటుంది. ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి. తక్కువ సైజ్ వీడియో ఉంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ కాదని సమాచారం. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో యాపిల్ బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.
అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్స్..
Upcoming WhatsApp Features : త్వరలో వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్స్ తెచ్చేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటా సన్నాహాలు చేస్తోంది. మెసేజ్ డిస్అపీయరింగ్ మోడ్, వ్యూ ఒన్స్ అండ్ మల్టీ డివైజ్, మెసేజ్ పిన్, పిన్ డ్యురేషన్ లాంటి ఫీచర్లను త్వరలో బీటా యూజర్లకు అందించనుంది. అలాగే వాట్సాప్ పైభాగంలో డార్క్ కలర్ బార్ కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.