అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ 'స్పేస్‌ఎక్స్' మొట్టమొదటి ప్రైవేట్ రైడ్‌ను నిర్వహించింది. అంతరిక్ష పర్యటనల కోసం తీర్చిదిద్దిన వాహక నౌకలో వీరి ప్రయాణం బుధవారం ప్రారంభమైంది. 'ఇన్స్పిరేషన్-4' అనే ఈ మిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఫ్లోరిడాలోని 'కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం రాత్రి వీరి యాత్ర ప్రారంభమైంది. మొత్తం నలుగురు ప్రయాణికులు భూమికి 540 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్లి, తిరిగిరానున్నారు.
ఈ మొత్తం యాత్రలో షిఫ్ట్-4 పేమెంట్స్ అనే డిజిటల్ పేమెంట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు 38 ఏళ్ల జారెడ్ ఐజాక్‌మన్ సహా.. సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్, డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ, 51ఏళ్ల టీవీ నటి సియాన్ ప్రోక్టర్ ఉన్నారు. అయితే ఈ నలుగురిలో ఎవరికీ ఇంతకముందు వ్యోమగాములు/అంతరిక్ష యాత్ర చేపట్టిన అనుభవం లేకపోవడం విశేషం. స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన పూర్తి ఆటోమేటెడ్ డ్రాగన్ 'స్పేస్ క్యాప్సూల్'లో వీరంతా అంతరిక్షంలోకి వెళ్లారు. గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) నాసా వ్యోమగాములను సైతం దీనిలోనే తరలివెళ్లారు. ఇన్స్పిరేషన్-4లో ప్రయాణం ద్వారా 'అంతరిక్ష యాత్రలపై ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు' ఐజాక్‌మన్ వెల్లడించారు.
వ్యోమగాముల గ్రావిటీ అనుభవం
గొప్పపనికి ఆరంభం..
- ఈ మిషన్ ద్వారా రెండు వందల మిలియన్ డాలర్ల నిధులను సేకరించి 'సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్'కి అందివ్వనున్నారు. ఈ డబ్బును పిల్లల క్యాన్సర్ పరిశోధనతో పాటు.. చికిత్సకు ఖర్చుచేస్తారు. ఈ యాత్రకోసం ఎంపికైన వారంతా భిన్న నేపథ్యాలు గలవారని, స్ఫూర్తిమంతమైన వ్యక్తులని ఐజాక్‌మన్ పేర్కొన్నారు.
ఈ స్పేస్ క్యాప్సూల్‌లోనే అంతరిక్షయాత్ర - ఇన్స్పిరేషన్-4 యాత్రలో పాల్గొన్న హేలీ ఆర్సెనాక్స్ అనే మహిళ కృత్రిమ అవయవంతో అంతరిక్షంలో అడుగుపెట్టనున్న మొట్టమొదటి వ్యక్తిగా నిలవనున్నారు. అంతేగాక 1983లో 32ఏళ్ల వయసులో అంతరిక్షయానం చేపట్టిన 'సాలీ రైడ్' తర్వాత.. అతిచిన్న వయసులో అక్కడికి వెళ్లనున్న అమెరికన్‌గా హేలీ అవతరించనుంది.
- ఆరిజోనాకు చెందిన 51ఏళ్ల ప్రొఫెసర్ సియాన్ ప్రోక్టర్.. బిడ్డింగ్‌లో 200మందిని వెనక్కి నెట్టి ఈ యాత్రలో స్థానం సంపాదించారు.
- ఈ యాత్ర చేపట్టబోయే వారిలో మరో వ్యోమగామి వాషింగ్టన్‌కి చెందిన 42ఏళ్ల క్రిస్ సెంబ్రోస్కీ ఓ డేటా ఇంజనీర్. బిడ్డింగ్‌లో తన పేరు రానప్పటికీ.. తన స్నేహితుడి స్థానంలో ఈ యాత్ర చేపడుతున్నారు ఈయన.
- అంతరిక్షయాత్రలో ఆహారంగా పిజ్జాలను తీసుకెళ్లారు వ్యోమగాములు.
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కంటే 100 మైళ్ల ఎత్తుకి వీరు చేరుకున్నారు. ఈ యాత్రతో 'స్పేస్ రైడ్'లకు సంబంధించి ఈ ఏడాది ఓ మైలురాయిగా నిలిచిపోనుంది.
వీరి యాత్ర ప్రారంభానికి ముందు.. ప్రయాణీకులకు సకల హంగులతో బస, సౌకర్యాలను అందించింది స్పేస్‌ఎక్స్.
ఇవీ చదవండి: