తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇన్​స్టాగ్రామ్​ సేవలకు అంతరాయం.. నెటిజన్లు ఫైర్​.. భారత్​లోనూ..

Instagram Server Down : ప్రముఖ సామాజిక దిగ్గజం ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం వేకువజామున నుంచే ఇన్​స్టాగ్రామ్ పనిచేయట్లేదని నెటిజన్లు ఫొటోలు షేర్ చేశారు.

instagram server down
instagram server down

By

Published : May 22, 2023, 11:08 AM IST

Updated : May 22, 2023, 12:21 PM IST

Instagram Server Down : ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్​స్టాగ్రామ్ సేవలు అమెరికా సహా పలుదేశాల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా నిలిచిపోయాయి. 1,88,000 మంది యూజర్లకు ఇన్​స్టాగ్రామ్ పనిచేయలేదని.. డౌన్​డిటెక్టర్ అనే వెబ్​సైట్ వెల్లడించింది. భారత్​లోనూ ఈ ప్రభావం కనిపించిందని తెలిపింది. దీనిపై స్పందించిన మెటా ప్రతినిధులు.. సమస్యకు కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. అంతరాయానికి క్షమాపణలు చెప్పారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఇన్​స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఇన్​స్టాగ్రామ్​ను ట్విట్టర్​లో ట్యాగ్​ చేస్తూ.. యాప్​ పనిచేయడం లేదని వెల్లడించారు. గత 24 గంటల్లో ఇన్​స్టాగ్రామ్​ సరిగ్గా పనిచేయట్లేదని అనేక మంది వినియోగదారులు మేసేజ్​లు పెడుతున్నట్లు .. డౌన్​డిటెక్టర్ అనే వెబ్​సైట్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ యాప్​లో ఇబ్బందులు ఉన్నాయని 87 శాతం మంది తెలిపారని పేర్కొంది. ఇన్​స్టాగ్రామ్ వెబ్​సైట్​లో సమస్య ఎదుర్కొంటున్నామని 9 శాతం మంది.. లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నామని 4 శాతం మంది తెలిపారని వెల్లడించింది.

భారత్​లోనూ అంతరాయం..
భారత్​లోనూ 9,357 మంది ఇన్​స్టాగ్రామ్ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. వీరిలో 42 శాతం మంది సర్వర్ వల్ల ఇబ్బందులు, 41 శాతం మంది ఇన్​స్టాగ్రామ్ యాప్ వల్ల.. 16 శాతం మంది లాగిన్ సమస్య ఎదుర్కొన్నామని వెల్లడించారు.

రెండు నెలల క్రితం నిలిచిపోయిన ఇన్​స్టాగ్రామ్ సేవలు..
అంతకుముందు ఈ ఏడాది మార్చి 9న.. ఇన్​స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు యాప్​లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్​సైట్​ 'డౌన్​ డిటెక్టర్' వెల్లడించింది. 'డౌన్ ​డిటెక్టర్' నివేదిక ప్రకారం.. అమెరికాలో 46,000 కంటే ఎక్కువ మంది యాప్ వినియోగదారులు ఇన్​స్టా యాక్సెస్​ చేసే సమయంలో​ సమస్యను ఎదుర్కొన్నట్లుగా సంస్థకు కంప్లైంట్​ చేశారు. యూకే, భారత్​, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల నుంచి వేలాది మంది యూజర్లు ఈ సమస్యపై మెటా సంస్థకు రిపోర్ట్​ చేసినట్లు 'డౌన్​ డిటెక్టర్' వెబ్​సైట్​ పేర్కొంది. ఇప్పటి వరకు సుమారు 27,000 మందికిపైగా ఈ సమస్య తలెత్తిన్నట్లు వెబ్​సైట్​ తెలిపింది.

ముఖ్యంగా ఇన్​స్టాగ్రామ్​ సేవల అంతరాయంపై ఫిర్యాదుల్లో 50 శాతం రిపోర్ట్​లు.. సర్వర్​ డౌన్​కు సంబంధించినవని.. కాగా, మరో 20 శాతం ఇన్​స్టాగ్రామ్​లో లాగిన్​ అయ్యే సమయంలో ఎదుర్కొన్న సమస్యలని వెబ్​సైట్​ చెప్పింది. దీనిపై స్పందించాలన్న ప్రముఖ లండన్​ న్యూస్​ ఏజెన్సీ సంస్థ 'రాయిటర్స్'​ చేసిన అభ్యర్థనకు మెటా వెంటనే స్పందించలేదు.

Last Updated : May 22, 2023, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details