Smartphone Selling Tricks in Telugu : స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. అయితే.. మెజారిటీ జనం ఒక స్మార్ట్ ఫోన్‌ను రెండు మూడు సంవత్సరాలకు మించి ఉపయోగించడం లేదు. కొత్త ఫీచర్ల కోసమో, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోసమో, లేక సరదాగానో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్‌కు మారిపోతున్నారు. ఆ సమయంలో పాత స్మార్ట్‌ఫోన్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేస్తుంటారు. కానీ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మూల్యం చెల్లిస్తుంటారు! ఇంతకీ.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకింగ్, యూపీఐ యాప్స్: మీరు ఫోన్‌లోని అన్ని బ్యాంకింగ్ యాప్‌లను డెలిట్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఈ యాప్‌లు మీ మొబైల్ నెంబర్‌కు లింక్ అవుతాయి కాబట్టి.. మీ ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఓటీపీ తెలియకపోవచ్చు. కానీ.. యాప్‌లో మిగిలి ఉన్న ఏదైనా డేటా ప్రమాదకరమైనది కావచ్చు. కాబట్టి ఫోన్లోని అన్ని బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లను డెలిట్ చేయండి.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 14 సూపర్ టిప్స్ పాటిస్తే చాలు!
కాల్ రికార్డ్స్, మెసేజెస్ :మీ మెసేజెస్, కాల్ రికార్డ్స్ అందులో లేకుండా చూడండి. అనవసరమైనవి అయితే మీరే డెలిట్ చేయండి. కావాలి అనుకుంటే మాత్రం.. మీ కాంటాక్ట్స్ బ్యాకప్ చేసినట్టుగానే.. వీటిని కూడా బ్యాకప్ చేసుకోండి. మెయిల్‌కు సెండ్ చేసుకోండి. గూగుల్ డిస్క్‌లో స్టోర్ చేయండి. ఆ తర్వాత మీ కొత్త ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ఎక్స్‌ట్రనల్ డ్రైవ్‌లో బ్యాకప్ :ఫొటోలు, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను బ్యాకప్ చేసేందుకు క్లౌడ్ స్టోరేజీ సొల్యూషన్ ఉపయోగించండి. గూగుల్ ఫొటోస్, గూగుల్ డిస్క్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి సర్వీసులను ఉపయోగించి క్లౌడ్ బ్యాకప్‌ను ఎంచుకోవచ్చు. క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ద్వారా డేటాను రీస్టోర్ చేయడం సులభం అవుతుంది. ఎక్స్టర్నల్ డ్రైవ్ బ్యాకప్ మెథడ్ డేటాకు అదనపు రక్షణ అందిస్తుంది.
వాట్సాప్ స్టేటస్ ఇక ఇన్‌స్టాలోనూ షేరింగ్- మెటా నయా ఫీచర్
డివైజ్ రీసెట్ చేసే ముందు :మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మొత్తం డేటా డెలిట్ అవుతుంది. అయితే.. మిమ్మల్ని మీ గూగుల్ అకౌంట్ల నుంచి ఆటోమాటిక్‌గా లాగ్ అవుట్ చేయదని గమనించాలి. ఫ్యాక్టరీ రీసెట్‌ను ప్రారంభించే ముందు అన్ని గూగుల్ అకౌంట్లు, ఇతర ఆన్‌లైన్ అకౌంట్ల నుంచి మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయడం చాలా అవసరం. మీరు ఫోన్ సెట్టింగ్స్‌లో ‘accounts’ కోసం సెర్చ్ చేయడం ద్వారా.. లేదా జీమెయిల్ సెట్టింగ్స్ ద్వారా ‘accounts’ యాక్సెస్ చేయడం ద్వారా లాగిన్ చేసిన అకౌంట్లను తెలుసుకోవచ్చు.