తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

స్మార్ట్‌ఫోన్‌ హ్యాంగ్‌ అవుతోందా..? అయితే ఈ టిప్స్‌ మీకోసం.. - ఫోన్ పనితీరు వార్తలు

Smartphone Hang Solution: చాలాసార్లు స్మార్ట్​ఫోన్​ హ్యాంగ్ అవ్వడం, పనితీరు నెమ్మదించడం చూస్తుంటాం. మరి ఈ సమస్యలకు గల కారణాలేంటి? ఫోన్‌ పనితీరును మెరుగుపరచుకోవాలంటే ఏం చేయాలి?

Smartphone Hang Solution
స్మార్ట్‌ఫోన్‌ హ్యాంగ్‌ అవుతోందా

By

Published : Feb 18, 2022, 12:56 PM IST

Smartphone Hang Solution: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకీ కొత్త కొత్త మోడళ్లతో టెక్‌ అభిమానుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. వినూత్నంగా అదిరే ఫీచర్లను పరిచయం చేస్తూ ఆయా కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కొత్త వాటిని ఆవిష్కరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో, శక్తిమంతమైన హార్డ్‌వేర్‌లతో మార్కెట్లలోకి అడుగుపెడుతున్నాయి.

అయితే, వినియోగదారుడి చేతిలోకి రాగానే ఫోన్ల పనితీరు నెమ్మదించడం, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ఈ సమస్యలకు గల కారణాలేంటీ? ఫోన్‌ పనితీరును మెరుగుపరచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఇంటర్నల్‌ స్టోరేజీలో స్పేస్‌ ఉందా?

కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో ఎల్లప్పుడూ ఫ్రీ స్పేస్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌ కెపాసిటీ ఉంది కదా అని అతిగా డాటా నిల్వ చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ స్టోరేజీ సామర్థ్యానికి దగ్గరగా డాటా చేరుకున్నట్లయితే ఫోన్‌ నెమ్మదించడం, హ్యాంగ్‌ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. సోషల్‌ మీడియా యాప్‌ల్లో మనం పంపిన సందేశాలు, వీడియోలకు అవసరమైన స్టోరేజ్‌ లేకపోవడమూ దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

.

సెట్టింగ్స్‌లోకెళ్లి స్టోరేజీ సెట్టింగ్‌లో ఫ్రీ స్పేస్‌ ఉందో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెల్ స్టోరేజీ నిండిపోయినట్లయితే Settings- Storage-Cache క్లిక్‌ చేస్తే కొంచెం స్పేస్‌ ఫ్రీ అవుతుంది.

వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాల్సిందే..

స్మార్ట్‌ఫోన్‌లో ఏదో అవసరం పడినపుడు కొన్ని యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటాం. అవసరం తీరాక దాన్ని అలాగే ఉంచేసి మరచిపోతాం. అలాంటి ఓపెన్‌ చేయని యాప్స్‌ ఫోన్‌లో ఎన్ని ఉన్నాయో చూసుకొని వాటిని రీమూవ్‌ చేయాల్సిందే. ఇలాంటి అనవసరమైన యాప్స్‌ వల్ల ఫోన్‌లో స్పేస్‌ వృథాగా పోతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ యాప్స్‌ రన్‌ అవుతూ ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యంతో పాటు ర్యామ్‌లో కొంత స్పేస్‌ నిండిపోతోంది.

యానిమేషన్‌ స్పీడ్‌ మార్చేయండి..

స్మార్ట్‌ఫోన్‌లో విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్స్ ఎనేబుల్ అయితే కూడా మొబైల్‌ వేగం తగ్గిపోతోంది. కాబట్టి యానిమేషన్స్‌ను పూర్తిగా టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

దీని కోసం Settings-> About-> Phone-Build Number పై క్లిక్ చేయాలి. Developer అనే ఆప్షన్స్ కనిపించేంతవరకు 7సార్లు ట్యాప్ చేయాలి. తర్వాత Settings-Developer Options-Windows-Animation Scale-Animations off పై క్లిక్‌ చేస్తే యానిమేషన్‌ టర్న్‌ ఆఫ్‌ అయిపోతోంది.

.

రీస్టార్ట్‌ చేసేయండి..

ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సింపుల్‌ ట్రిక్‌. ఫోన్‌ను రీస్టార్ట్‌ చేసినపుడు బ్యాక్ గ్రౌండులో మెమెరీ క్లీన్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్‌ కూడా రీసెట్‌ అవుతాయి. ఫోన్ పవర్ బటన్ నొక్కి పట్టుకుంటే రీస్టార్ట్ ఆప్షన్ కనిపిస్తోంది. దీన్ని క్లిక్‌ చేస్తే ఫోన్‌ రీస్టార్ట్‌ అవుతోంది.

ఈ యాప్స్‌ మాత్రమే వాడాలి

స్మార్ట్‌ఫోన్‌ల కోసం సూపర్‌-లో-ఎండ్‌ వెర్షన్‌లతో కూడిన లైట్‌/ఆండ్రాయిడ్‌ గో యాప్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గూగుల్‌ ఆప్‌ స్టోర్‌లో లైట్‌ లేదా గో ఎడిషన్‌ యాప్‌లు ఎన్నో ఉన్నాయి. మెటా యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా లైట్‌ వెర్షన్‌ యాప్‌లు కూడా వచ్చాయి. ట్విటర్‌, స్పోటీఫై, స్కైప్‌ వంటి యాప్స్‌ కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఈ యాప్స్‌ పరిమితంగానే స్టోరేజీని కలిగి ఉండి, వేగంగా పనిచేసేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం వచ్చే కొత్తతరం మోడళ్లలోనూ ఈ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. సోషల్‌ మీడియా మాధ్యమాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ల వల్ల ఎక్కువ బ్యాటరీ వృథా అయిపోతుందనుకుంటే లైట్‌ వెర్షన్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

ఆప్‌డేట్ చేసుకోవాల్సిందే..

ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను ఉపయోగించే వారందరూ ఎప్పటికప్పుడు ఫోన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి. దీనివల్ల కొత్త సాప్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అయ్యి సిస్టమ్‌ వేగంగా పనిచేస్తోంది. ఇందుకు ఫోన్లో ఉండే 'సెట్టింగ్స్‌'లోకి వెళ్లి దానిలోని 'సిస్టమ్‌ అప్‌డేట్‌' అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. దానిలో అప్‌డేట్‌పై ఏదైనా సూచన కనిపిస్తే.. వెంటనే తమ ఫోన్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి.

ఫ్యాక్టరీ రీసెట్‌..

మనం వాడే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ద్వారా ఫోన్‌ పనితీరులో చాలా మార్పులు కనిపిస్తాయి. ఫోన్‌లోని అనవసరపు డేటా అంతా తొలగిపోతుంది. ఫోన్‌ ఖాళీ అయ్యి మరింత స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. ఫోన్‌ స్టోరేజీలో గానీ ఎస్‌డీ కార్డులో గానీ మాల్వేర్‌, బగ్స్‌, వైరస్‌లతో కూడిన హానికర ఫైళ్లు ఉన్నా తొలగిపోవడానికి ఫ్యాక్టరీ రీసెట్‌ ఎంతగానో తోడ్పడుతుంది.

కస్టమ్‌ రోమ్‌

మీ ఫోన్‌ పనితీరును మెరుగపరిచేందుకు ఉన్న మరో అవకాశం కస్టమ్‌ రోమ్. ప్రస్తుతం మీ ఫోన్‌లో ఉన్న ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్‌ల (శాంసంగ్‌ వన్‌యూఐ, షావోమి ఎమ్‌యూఐ, వన్‌ప్లస్‌ ఆక్సిజన్‌, ఒప్పో కలర్స్‌ఓఎస్‌)కు బదులు మీకు నచ్చినట్లుగా ఓఎస్‌లో మార్పులు చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఈ కస్టమ్‌ రోమ్‌ మీ ఫోన్‌ తయారీ కంపెనీ నిబంధనలకు విరుద్ధం. దీనవల్ల మీ ఫోన్‌ గ్యారెంటీ, వారెంటీ పోతాయి. దీన్ని ఎక్కువగా ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలపర్స్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను పరీక్షించేవారు ఉపయోగిస్తుంటారు. ఈ కస్టమ్‌ రోమ్‌ ఇన్‌స్టాల్ చేసే ముందు మీ ఫోన్‌లో డేటా మొత్తాన్ని తప్పనిసరిగా బ్యాకప్ చేసుకోవాలి.

ఇదీ చూడండి:క్రోమ్‌ బ్రౌజర్‌లో ఈ పది ట్రిక్స్‌ గురించి తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details