తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మొబైల్​లో ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా?.. ఈ సింపుల్ ట్రిక్స్​ మీకోసమే.. - స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యలు

మొబైల్​లో ఛార్జింగ్ ఊరికే అయిపోతోందా? ఫోన్​ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.

smartphone-battery-life-tips
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ చిట్కాలు

By

Published : Jan 22, 2023, 7:31 AM IST

Updated : Jan 22, 2023, 7:40 AM IST

ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్​ఫోన్​లు ఉన్నాయి. కంపెనీలు సైతం సరికొత్త మోడల్స్​లో ఫోన్లను మార్కెట్​లోకి విడుదల చేస్తున్నాయి. ఎన్ని కొత్త రకాల స్మార్ట్​ఫోన్​లు వచ్చినప్పటికి అన్నింటికి బ్యాటరీ కామన్​. దానితోనే కదా ఫోన్​ నడిచేది. అయితే ఈ బ్యాటరీ లైఫ్​ను మరింతగా పెంచేందుకు, ఎక్కవ కాలం పనిచేసేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

పవర్​ సేవింగ్​ మోడ్​ను ఆన్​ చేయడం:
ఫోన్​ లో బ్యాటరీలో ఉన్నప్పుడు ఈ ఆప్షన్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్​ వెంటనే స్విచ్​ ఆఫ్​ కాకుండా ఇది సహాయ పడుతుంది. ఫోన్​లో అనవసరంగా రన్​ అవుతున్న ఫంక్షన్​లను ఇది నిలువరిస్తుంది. తిరిగి చార్జింగ్​ పెట్టేంత వరకు ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అవ్వకుండా చూస్తుంది.

స్క్రీన్​ బ్రైట్​నెస్​ తగ్గించండం:
బ్రైట్​నెస్ కూడా ఫోన్​ చార్జింగ్​పై ప్రభావం చూపుతుంది. కళ్లకు సౌకర్యవంతంగా ఉండేంత వరకు దీన్ని తగ్గించుకోవాలి. వీలైతే ఆటోమెటిక్​ అడ్జస్ట్​మెంట్​ను​ ఆన్​ చేసుకోవాలి. ఇది పరిసర కాంతి స్థాయికి అనుగుణంగా బ్రైట్​నెస్​ను మార్పు చేసుకుంటుంది.

ఉష్ణోగ్రతల ప్రభావం:
చల్లని, వేడి ప్రదేశాలకు ఫోన్​ను దగ్గరగా ఉంచినప్పుడు మీ మొబైల్​ బ్యాటరీ చెడిపోయో ప్రమాదం ఉంది. కనుక ఫోన్​ను మరి ఎక్కువ వేడి, చల్లని ప్రదేశాల్లో ఉంచకండి.

డు నాట్​ డిస్టర్బ్:​
మొబైల్​లో డౌన్​టైమ్​ షెడ్యుల్​ని పెట్టుకోవడం మంచిది. మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు, రాత్రి పడుకునే సమయానికి వీటిని సెట్​ చేసుకోవాలి. దీంతో మొబైల్​పై​ భారం తక్కువగా పడుతుంది. అనవసరంగా నోటిఫికేషన్లు రావు. బ్యాటరీ చార్జింగ్​ సైతం వృధా కాదు.

ఎయిర్​ప్లయిన్​ మోడ్​:
సిగ్నల్​ సరిగ్గా లేనప్పుడు మొబైల్​ను ఎయిర్​ప్లయిన్​ మోడ్​లో ఉంచుకోవాలి. ఎందుకంటే సిగ్నల్​ లేని సమయంలో బ్యాటరీపై భారం పడతుంది. దీంతో ఫోన్​ చార్జింగ్​ తొందరగా అయైపోతుంది. వైఫై కనెక్ట్​ చేసుకున్నప్పుడు కూడా ఫోన్​ను ఎయిర్​ప్లయిన్​ మోడ్​లో ఉంచడం మరవద్దు.

సౌండ్​లు వైబ్రేషన్లు​:
కీబోర్డ్​ సౌండ్​లు, వైబ్రేషన్​లు కూడా మొబైల్​ చార్జింగ్​ దిగిపోవడానికి కారణం. పక్కవారికి ఇది అసౌర్యంగానూ ఉంటుంది. కాబట్టి కీబోర్డ్​ సౌండ్​లు, వైబ్రేషన్​లు ఆఫ్​ చేయడం మంచిది
అవసరం లేని యాప్​లు:
మనం మొబైల్​లో ఎక్కవగా వాడని యాప్​లో చార్జింగ్​ను తగ్గిస్తాయి. కాబట్టి తక్కువగా వాడే, అసలు అవసరమే లేని యాప్​లు డిలీట్​ చేయాలి.

వైఫై, బ్లూటూత్​లను ఆన్​లోనే ఉంచండి:
ఫోన్​లో చార్జింగ్​ తక్కువగా ఉన్నప్పుడు వైఫై, బ్లూటూత్​లను ఆన్​లోనే ఉంచడం మంచిది. ఎందుకంటే పదే పదే వైఫై, బ్లూటూత్​లను ఆన్, ఆఫ్​ చేయడం ​వల్ల చార్జింగ్​ అయిపోయో అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆన్​ చేసిన ప్రతిసారి.. అవి సిగ్నలను అందుకోవలసి ఉంటుంది.

Last Updated : Jan 22, 2023, 7:40 AM IST

ABOUT THE AUTHOR

...view details