ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ టీవీ అనేది ఓ వినోద సాధనంగా మారింది. కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఇంట్లో టీవీ ముందు కూర్చుని సినిమాలు, రకరకాల షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాం. కొన్ని సార్లు మన టీవీ స్క్రీన్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోయి బొమ్మ సరిగా కనిపించదు. అలాంటప్పుడు మన టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేయవలసి ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది టీవీ తెరను ఎలా క్లీన్ చేయాలో తెలియక రకరకాల వస్త్రాలను ఉపయోగిస్తూ.. కొన్ని లిక్విడ్లను స్ప్రే చేస్తుంటారు. అలా చేయడం వల్ల స్క్రీన్ పాడవుతుంది. టీవీ స్క్రీన్‌ను క్లీన్ చేయడం కోసం అని కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి.
టవల్స్ వద్దే వద్దు.. మైక్రోఫైబర్స్ ముద్దు
ప్రస్తుతం కాలంలో అన్నీ ఎల్సీడీ, ఎల్ఈడీ, ఓఎల్ఈడీ స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీలే మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ టీవీల స్క్రీన్లు మాత్రం చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. వీటిపై కొంచెం ఒత్తిడి కలిగినా సరే పాడయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ విషయం తెలియక చాలా మంది టవల్స్, టిష్యూలతో టీవీ స్క్రీన్లను తుడుస్తూ ఉంటారు. ఫలితంగా వాటిపై గీతలు పడతాయి. అందుకే స్మార్ట్ టీవీని శుభ్రం చేసేటప్పుడు తువాళ్లకు బదులుగా మైక్రోఫైబర్ క్లాత్స్ వినియోగించాలి. స్క్రీన్‌పై పడ్డ మరకలను ఈ మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిస్తే.. పూర్తిగా తొలిగిపోవడమే కాకుండా.. స్క్రీన్‌పై ఎలాంటి స్క్రాచెస్ పడవు.
స్ప్రే చేయవద్దు
స్మార్ట్ టీవీ తెరను శుభ్రం చేసే సమయంలో.. డైరెక్ట్‌గా స్క్రీన్‌పై ఎటువంటి లిక్విడ్ స్ప్రేలు చేయకూడదు. అలా స్ప్రే చేయడం వల్ల టీవీలోని అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటుగా తెరపై శాశ్వతంగా కొన్ని మరకలు ఏర్పడే అవకాశం ఉంది. అమ్మోనియా, ఆల్కహాల్, అసిటోన్ లాంటి స్ప్రేలను వినియోగించికూడదు. ఎందుకంటే ఇవి స్క్రీన్‌పై ఉండే యాంటీ గ్లేర్ పూతను దెబ్బతీస్తాయి. అసలు టీవీని క్లీన్ చేసేటప్పుడు స్ప్రేలను వాడకూడదు. ఒకవేళ వాడవలసి వస్తే.. స్క్రీన్‌పై డైరెక్ట్‌గా స్ప్రే చేయకుండా క్లీనింగ్ క్లాత్‌పై వేసుకుని శుభ్రం చేయాలి.