ప్రస్తుత ఆధునిక జీవనంలో ప్రతిదీ వేగంగా జరగాలి. లేదంటే ఎక్కడాలేని చిరాకు.. అలాంటిది మనంవాడే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్(slow laptop) ప్రతిసారి తాబేలు మాదిరి నెమ్మదిస్తే..! అబ్బో.. మౌస్ నెలకేసి కొట్టేంతా కోపం. పీసీ (Personal computer) నెమ్మదించడం ద్వారా చేసే పని ఆలస్యమై.. వ్యక్తిగతంగా మన పనితనంపైనే ప్రభావం పడుతుంది. అయితే, చిన్న టిప్స్ ఎప్పుటికప్పుడు పాటిస్తే సాధ్యమైనంతా వరకు మీ ల్యాప్‌టాప్‌ను(boost laptop speed) పరుగులు పెట్టించవచ్చు. అవెంటో చూద్దాం..
'బోగీ'లతో నింపకండి
పని సౌలభ్యం కోసం ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఎక్కువ ట్యాబ్‌లు (tab's) ఓపెన్ చేస్తుంటాం. ఇది సహజమే. కానీ, ఇలా వీలైనంత ఎక్కువగా ట్యాబ్‌లు ఓపెన్ చేసి పెట్టడం వల్ల ల్యాప్‌టాప్ ర్యామ్ (RAM) ప్రాసెసర్‌పై భారం పెరిగి పీసీ నెమ్మదిస్తుందట. కాబట్టి ఖాళీగా ఉందని ట్యాబ్‌బార్ (tab bar) మొత్తాన్ని 'బోగీ'లతో నింపకండి. వెంటవెంటనే ఉపయోగించే ట్యాబ్‌లను మాత్రమే అలాగే ఉంచి.. కాసేపు ఆలస్యంగా వాడే ట్యాబ్‌లను ఎప్పుటికప్పుడూ తొలగిస్తూ.. ఓపెన్ చేస్తూ పని పూర్తి చేసుకోండి.
'బ్యాక్‌గ్రౌండ్' మరవద్దు
మనం వాడినా.. వాడకున్నా చాలా ప్రోగ్రామ్స్ సిస్టమ్ బ్యాక్‌గ్రౌండ్ (background programs)లో నడుస్తూనే.. ఉంటాయి. Ctrl+Shift+Esc క్లిక్ చేయడం వల్ల విండోస్ టాస్క్ మేనేజర్ (task manager)లో అవెంటో తెలుసుకోవచ్చు. అందులోని ఏ ప్రోగామ్ అయితే మీకు అనవసరం అనిపిస్తుందో దానిపై రైట్ క్లిక్ (right click) చేసి 'ఎండ్ టాస్క్' (End Task) చేయండి.
రీఫ్రెష్ అవసరమే మరి