తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Gmail Confidential Mode: ఆండ్రాయిడ్​ ఫోన్​తో 'సీక్రెట్​ మెయిల్స్'​ పంపేయండిలా! - జీమెయిల్​ కాన్ఫిడెన్షియల్​ మోడ్ గడవు తేదీ

Gmail Confidential Mode: ఆండ్రాయిడ్ ఫోన్​, ఐఫోన్​, కంప్యూటర్లలో సీక్రెట్​ మెయిల్స్​ పంపవచ్చని మీకు తెలుసా? కాన్ఫిడెన్షియల్​ మోడ్​ ద్వారా సున్నితమైన సందేశాలు, అటాచ్​మెంట్స్​ పంపవచ్చు. వాటికి నిర్దేశిత గడువు తేదీ, పాస్​కోడ్​ పెట్టవచ్చు. అవతలివారు మీ సందేశాలను ఇతరులకు షేర్​ చేయకుండా నిరోధించవచ్చు. ​అదెలాగో మీరూ తెలుసుకోండి.

Gmail confidential mode
Gmail confidential mode

By

Published : Dec 21, 2021, 2:08 PM IST

Gmail Confidential Mode: ఈ మధ్యకాలంలో దాదాపు అందరికి.. జీ-మెయిల్​ అకౌంట్​ ఉంటుందని చెప్పొచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా సున్నితమైన రహస్య సందేశాలు, అటాచ్​మెంట్​ ఫైల్స్​ పంపించుకోవచ్చు. అయితే.. జీ-మెయిల్​ ద్వారా సీక్రెట్​ మెసేజ్​లు పంపుకోవచ్చని మీకు తెలుసా? జీ-మెయిల్​లో కాన్ఫిడెన్షియల్​ మోడ్​ ఫీచర్​ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. ఈ మోడ్​ అనధికారిక వ్యక్తులు, సంస్థల నుంచి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీరు పంపించే మెసేజ్​లకు నిర్దేశిత గడవు తేదీని సెట్ చేయడానికి ఈ కాన్ఫిడెన్షియల్​ మోడ్​ని ఉపయోగించవచ్చు.. గడవు తేదీ ముందే.. ఆ యాక్సెస్‌ని ఉపసంహరించుకోవచ్చు. ఈ విధంగా పంపించిన సందేశాలు.. అవతలివారు ఫార్వార్డ్​, కాపీ, ప్రింట్​, డౌన్‌లోడ్ చేయకుండా.. డిజేబుల్​ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

కంప్యూటర్​, ఆండ్రాయిడ్​, ఐఫోన్​, ఐప్యాడ్​ ద్వారా గోప్యంగా మెసేజ్​లు, అటాచ్​మెంట్లు ఎలా పంపాలో తెలుసుకుందాం..

కంప్యూటర్​లో ఇలా..

1. కంప్యూటర్​లో జీమెయిల్​ ఓపెన్​ చేయాలి.

2. కంపోజ్​పై క్లిక్​ చేయాలి.

3. విండోకు కిందన 'టర్న్​ ఆన్​ కాన్ఫిడెన్షియల్​ మోడ్​'ను క్లిక్​ చేయాలి.

4. గడువు తేదీ, పాస్‌కోడ్‌ను సెట్ చేయాలి. ఈ సెట్టింగ్స్​ మెసేజ్​, అటాచ్​మెంట్స్​కు వర్తిస్తాయి.

5. మీరు 'నో ఎస్ఎంఎస్​ పాస్​కోడ్​' ఎంచుకుంటే జీమెయిల్​ యాప్‌ను ఉపయోగించేవారు మీ మెసేజ్​ను నేరుగా తెరవవచ్చు. యాప్​ లేకపోతే.. ఇ-మెయిల్ పాస్‌కోడ్​ను పంపుతుంది. మీరు 'ఎస్​ఎంఎస్​ పాస్​కోడ్'​ ఆప్షన్​ ఎంచుకుంటే.. అవతలివారు పాస్​కోడ్​ టెక్ట్​ మెసేజ్​ రూపంలో వెళ్తుంది. అందుకు మేసేజ్​ అందుకునేవారికి ఫోన్​ నెంబరు తప్పనిసరిగా ఎంటర్​ చేయాలి.

6. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సేవ్​ చేయాలి.

కంప్యూటర్​లో కాన్ఫిడెన్షియల్​ మోడ్​

ఆఫీసు ఖాతాతో జీ-మెయిల్​ను ఉపయోగిస్తుంటే.. కాన్ఫిడెన్షియల్ మోడ్‌ ఫీచర్​ను యాక్టివ్​ చేయడానికి.. అడ్మిన్​ను సంప్రదించాలి. వారి అనుమతితోనే ఈ ఫీచర్​ను ఉపయోగించుకోవడానికి వీలుపడుతుంది.

ఆండ్రాయిడ్​ ఫోన్​, ఐఫోన్​, ఐపాడ్​, ట్యాబ్లెట్​లలో ఎలాగంటే..?

  1. జీ మెయిల్​ యాప్​ని ఓపెన్​ చేయాలి.
  2. కంపోజ్​ మీద ట్యాప్​ చేయాలి.
  3. కుడివైపు మోర్​ ఆప్షన్​పై ట్యాప్​ చేయాలి.
  4. తర్వాత టర్న్​ ఆన్​ కాన్ఫిడెన్షియల్​ మోడ్​పై ట్యాప్​ చేయాలి
  5. తర్వాత ప్రక్రియ అంతా పైన కంప్యూటర్​లో సూచించిన విధంగానే వీటికి కూడా వర్తిస్తుంది.
  6. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డన్​పై ట్యాప్​ చేయాలి.
    ఫోన్​లో కాన్ఫిడెన్షియల్​ మోడ్​ ఆప్షన్​
    ఫోన్​లో కాన్ఫిడెన్షియల్​ ఆప్షన్​ ఓపెన్​ చేసిన తర్వాత..

గడువు తేదీకి ముందే యాక్సిస్​ను రిమూవ్​ చేయండిలా..

మీరు గడువు తేదీకి ముందు మీ మెసేజ్​ గ్రహీత ఇమెయిల్‌ను చూడకుండా కూడా ఆపవచ్చు.

ముందుగా కంప్యూటర్, ఆండ్రాయిడ్​ ఫోన్​, ఐఫోన్​, ఐపాడ్​, ట్యాబ్లెట్​లలో (దేనిలో అయినా) జీ మెయిల్​ ఓపెన్​ చేయాలి.

కంప్యూటర్​లో అయితే సెంట్​పై క్లిక్​ చేయాలి. ఆండ్రాయిడ్​ ఫోన్​, ఐఫోన్​, ఐపాడ్​, ట్యాబ్లెట్​లలో అయితే మెనూపై ట్యాప్​ చేయాలి. తర్వాత సెంట్​పై ట్యాప్ చేయాలి.

కాన్ఫిడెన్షియల్​ ఇ-మెయిల్​ ఓపెన్​ చేయాలి.

యాక్సిస్​ను రిమూవ్​ చేయాలి.

కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో పంపిన ఇమెయిల్‌ను తెరవండిలా..

మీరు సందేశం అటాచ్​మెంట్​లను గడువు తేదీ వరకు లేదా సెండర్​ యాక్సెస్‌ని తీసివేసే వరకు చూడవచ్చు. ఇమెయిల్‌ను తెరవడానికి మీరు పాస్‌కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

గమనిక

అయితే ఈ కన్ఫిడెన్షియల్​ మోడ్​ ద్వారా పంపిన సందేశాలను ఇతరులకు​ షేర్​ చేయకుండా నిరోధించే అవకాశముంది. అంతేకాని.. స్క్రీన్​ షాట్స్​, ఫోటోలు తీయకుండా ఆపడానికి వీల్లేదని గుర్తుంచుకోవాలి.

ఇదీ చూడండి:Google Chrome: ధరలు మారితే గూగుల్ క్రోమ్ చెప్పేస్తుందిలా..!

ABOUT THE AUTHOR

...view details