తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

టిక్​టాక్​ను మరిపించే రేసులో ఎవరు ముందు?

ప్రముఖ వీడియో షేరింగ్​ యాప్​ టిక్​టాక్​పై నిషేధం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పలు యాప్​లు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా రీల్స్​ అనే సరికొత్త ఫీచర్​తో ఇన్​స్టాగ్రామ్​ రాగా.. స్వదేశీ యాప్​లు రొపోసో, మిత్రోన్ దానికి గట్టి పోటీనిస్తున్నాయి.

which of these are ultimate tiktok Alternative: Instagram Reels, Roposo, Mitron?
ఇన్​స్టా రీల్స్​కు రొపోసో, మిత్రోన్​ నుంచి పోటీ..?

By

Published : Aug 9, 2020, 6:41 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

టిక్​టాక్​పై నిషేధం తర్వాత ఆ మార్కెట్​ను కైవసం చేసుకునేందుకు రీల్స్​ ఫీచర్​ను తీసుకొచ్చింది ఇన్​స్టాగ్రామ్​. ఇప్పటికే ఫొటో షేరింగ్​లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ యాప్​.. యూజర్లను ఆకట్టుకునేందుకు షార్ట్​ వీడియో ఫార్మాట్​లోనూ అడుగుపెట్టింది. భారతీయ విపణిలోనూ అధికారికంగా రీల్స్​ను లాంచ్​ చేసిందీ ఇన్​స్టా. అయితే దీనికి దేశీయ యాప్​లైన రొపోసో, మిత్రోన్​ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఇన్​స్టా రీల్స్​...

రీల్స్​ ఫీచర్​ను ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది ఫేస్​బుక్​కు చెందిన ఇన్​స్టాగ్రామ్. ఆగస్టు 5న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్​తోనే ఇన్​స్టా యాప్​లోనే చిన్నపాటి ఎంటర్​టైనింగ్​ క్లిప్​లు క్రియేట్​ చేసి షేర్​ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆడియో, వీడియో ఎఫెక్ట్ లైబ్రరీ ఆధారంగా 15 సెకన్ల వీడియోలను రూపొందించుకోవచ్చు. ఎడిటింగ్​ కూడా యాప్​లోనే చేసుకోవచ్చు. యూజర్​ అకౌంట్​ పబ్లిక్​లో ఉంటే పోస్టు చేసిన వెంటనే వీడియో కోట్ల మందికి చేరిపోతుంది. భారత్​లో అతిపెద్ద మార్కెట్​ను కలిగిన టిక్​టాక్​పై ప్రభుత్వం నిషేధం కారణంగా ఆయా యూజర్లను ఆకర్షించాలని చూస్తోంది ఇన్​స్టా.

అమెరికాలోనూ టిక్​టాక్​ను యాప్​ను బ్యాన్​ చేయాలని ట్రంప్ సర్కార్​ యోచిస్తోంది. ఫలితంగా అక్కడ కూడా ఇదే ఫీచర్​తో యూజర్లను మరింత ఆకట్టుకోవాలని భావిస్తోంది ఇన్​స్టాగ్రామ్​. అయితే ఈ బడా సంస్థకు భారతీయ సంస్థలు తయారు చేసిన రొపోసో, మిత్రోన్​ వంటి యాప్​లు ఊహించని పోటీనిస్తున్నాయి.

రొపోసో..

ఇప్పటికే 50 మిలియన్లకు పైగా డౌన్​లోడ్లు, ప్లేస్టోర్​లో 4.1 రేటింగ్​తో దూసుకెళ్తోంది రొపోసో. అంతేకాకుండా యాపిల్​ యాప్​ స్టోర్​లోనూ 4.4 రేటింగ్​ సాధించింది. భారత్​లోనే తయారైన ఈ యాప్​.. హిందీ, తమిళ్​, కన్నడ, గుజరాతీ, పంజాబీ, తెలుగు సహా పలు స్థానిక​ భాషల్లో అందుబాటులో ఉంది.

రొపోసో

యూజర్లు స్లో మోషన్​, టైమ్​ లాప్స్​ వంటి ఎన్నో ఫీచర్లతో వీడియోలను క్రియేట్​ చేసుకోగలుగుతారు. ఆయా కంటెంట్​ను వాట్సాప్​లో స్టేటస్​గా షేర్​ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్​ కోసం ఆడియో లైబ్రరీ, ఎపెక్ట్​లు ఈ యాప్​లో అందుబాటులో ఉన్నాయి.

మిత్రోన్​..

చిన్న వీడియో కంటెంట్​ క్రియేషన్​లో ఈ యాప్​ దూసుకెళ్తోంది. టిక్​టాక్​ బ్యాన్​ తర్వాత దీనికి బాగా ఆదరణ పెరిగింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా డౌన్​లోడ్లు సాధించింది. ప్లేస్టోర్​లో 3.9, యాపిల్​ యాప్​ స్టోర్​లో 4.4 రేటింగ్​ సాధించింది ఈ యాప్​ సులభంగా, చదువుకోని వాళ్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇందులో వీడియో క్రియేట్​ చేసి షేర్​ చేయగలరు.

మిత్రోన్​

ఈ స్వదేశీ యాప్​ల కన్నా ఇన్​స్టా కాస్త ముందు ఉండటానికి కారణం ఇప్పటికే దానికి భారీ యూజర్లు కలిగి ఉండటం.

టిక్​టాక్​ ఉన్నప్పుడు యూజర్ల ఎంగేజ్​మెంట్​ దాదాపు ఇప్పటికన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. టిక్​టాక్​ లేకపోవడం వల్ల ఇన్​స్టా ఎంచుకున్నారని.. ఒకవేళ భారత్​ యాప్​లు కూడా ఇన్​స్టాను మరిపించగలిగితే ఇన్​స్టాను వినియోగదారులు విడిచిపెట్టినా ఆశ్చర్యమేమి లేదని మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details