వెబ్ వెర్షన్‌కు మరిన్ని ఫీచర్లు జోడించేందుకు సిద్ధమైంది వాట్సాప్. వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్స్‌ను త్వరలో వెబ్వెర్షన్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు.. వాట్సాప్ సిద్ధమవుతోంది.
ప్రస్తుతం వాయిస్, వీడియో కాల్స్ సదుపాయాలు మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వెబ్‌వెర్షన్‌లో వాట్సాప్ వాడే వారు ఈ ఫీచర్లను వినియోగించేందుకు వీలులేదు. ఈ కారణంగా చాలా మంది వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్‌కు మొబైల్ ఫోన్‌ను మాత్రమే వినియోగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వెబ్ వెర్షన్‌ను మరింత ఆకర్షణీయంగా చేసేందుకు వాట్సాప్.. వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.