మెసేజింగ్ సేవల దిగ్గజం వాట్సాప్.. డెస్క్‌టాప్ యూజర్లకు సరికొత్త, అదనపు భద్రతా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంబంధిత యూజర్ మినహా.. ఇతరులెవ్వరూ డెస్క్‌టాప్ వెర్షన్‌ను, మీ ఛాట్లను యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా త్వరలోనే దీనిని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఎలా పని చేస్తుంది?
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. డెస్క్‌టాప్‌కు మీ వాట్సాప్ లింక్ చేసే ముందు ఫింగర్‌ప్రింట్ లేదా ఫేషియల్ అన్‌లాక్ అడుగుతుంది. అలా అన్‌లాక్ చేసిన తర్వాతే.. డెస్క్‌టాప్ క్యూఆర్ కోడ్‌ను యాక్సెస్ చేసే స్కానర్ ఓపెన్ అవుతుంది. దీని వల్ల మీరు మాత్రమే డెస్క్‌టాప్‌కు మీ వాట్సాప్‌ను లింక్ చేసుకోలగలుగుతారు.