సరికొత్త కెమెరా ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఆవిష్కరించనుంది చైనా దిగ్గజ సంస్థ వివో. ఐఎఫ్ఈఏ పేరుతో రూపొందించిన ఈ కెమెరా కాన్సెప్ట్‌కు ప్రతిష్టాత్మక 'రెడ్ డాట్ డిజైన్ అవార్డు-2020' దక్కింది. ఇందులో పాప్ అప్ సెల్ఫీ కెమెరాను తొలగించే వీలు ఉండడం, రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయటం దీని ప్రత్యేకత.
ఈ తొలగించిన సెల్ఫీ కెమెరా స్థానంలో ఇతర కెమెరా సెన్సార్లను ఉపయోగించే వీలును కూడా కల్పించింది వివో. సందర్భాన్ని బట్టి ఫిష్ ఐ, అల్ట్రా వైడ్ యాంగిల్, టెలిఫొటో తదితర లెన్స్‌ను అమర్చుకునే సదుపాయం ఉంటుంది. రిమోట్ ద్వారా ఒకటి కన్నా ఎక్కువ కెమెరాల నుంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ డిటాచబుల్ కెమెరా వాటర్ ప్రూఫ్ సాంకేతికతతో రానుంది.
ఎలా పనిచేస్తుంది?