మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది గూగుల్. అదే విధంగా భారతీయ వినియోగదారుల కోసం పీపుల్ కార్డ్స్ సదుపాయాన్ని మంగళవారం ప్రారంభించింది.
అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో వినియోగదారులు తమ ఉనికిని తెలియజెప్పేందుకు వీలుగా తొలిసారిగా 'వర్చువల్ విజిటింగ్ కార్డు' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు వర్చువల్ విజిటింగ్ కార్డును రూపొందించుకుని.. ప్రస్తుతం ఉన్న తమ వెబ్‌సైట్లు, సామాజిక ప్రొఫైళ్లు, సమాచారానికి మరింత ప్రచారం కల్పించుకునే వీలు కల్పించింది గూగుల్.
ఒకే కార్డు..
వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, స్వయం ఉపాధి, ఫ్రీలాన్సర్లు ఇలా అనేక రంగాల వ్యక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ మేనేజర్ లారెన్ క్లార్క్ తెలిపారు.
"మొబైల్ ఫోన్లలో ఆంగ్లంలో సెర్చ్ చేయడం ద్వారా ఈ వర్చువల్ విజిటింగ్ కార్డును పొందవచ్చు. ఈ కార్డుపై క్లిక్ చేయగానే పేరు, వృత్తి, ప్రదేశం తెలుసుకోవచ్చు. అసభ్య, నేరపూరిత సమాచారాన్ని వెల్లడించకపోవడం సహా ఒక గూగుల్ ఖాతాకు ఒకే కార్డును పరిమితం చేసేలా అనేక రక్షణాత్మక చర్యలను ఇందులో పొందుపరిచాం."
- లారెన్ క్లార్క్, గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ మేనేజర్