తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

భారత్​లో ఉత్తమ 5జీ స్మార్ట్​ ఫోన్లు ఇవే..

దేశంలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాకముందే 5జీ ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ మొదలైంది. మరి ఇప్పటివరకు భారత మార్కెట్లోకి వచ్చిన 5జీ ఫోన్లు ఏవి?.. అలానే రాబోయే 5జీ మోడల్స్‌ గురించి తెలుకోవాలంటే ఈ కథనం చదవండి..

Google Pixel 5
5G smartphones

By

Published : Nov 28, 2020, 1:36 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో పోటీపడుతోంది భారత్‌. ఇందులో భాగంగా వేగవంతమైన డేటా సేవలను అందించేందుకు టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీలు తమ పరికరాలను సిద్ధం చేస్తున్నాయి. ఫలితంగా మొబైల్‌ తయారీ కంపెనీలు కూడా 5జీ నెట్‌వర్క్‌ స్మార్ట్‌ఫోన్లను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి.

అయితే ఈ టెక్నాలజీతో ఫోన్‌ తయారీ అనేది ఖర్చుతో కూడుకున్నది కావడంతో మొబైల్ కంపెనీలు 5జీ ఫోన్లను ఎక్కువ ధర విక్రయించడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో 5జీ ఫోన్ అనేది సామాన్యుడి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. మొబైల్‌ విడిభాగాలను ఉత్పత్తి చేసే కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ మొబైల్స్‌ని అందించే దిశగా దృష్టి సారించాయి.

5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాకముందే 5జీ ఫోన్లకు మార్కెట్లో డిమాండ్ మొదలైంది. మరి ఇప్పటివరకు భారత మార్కెట్లోకి వచ్చిన 5జీ ఫోన్లు ఏవి?.. అలానే రాబోయే 5జీ మోడల్స్‌ ఏంటనేది ఓ లుక్కేద్దాం రండి.

1. యాపిల్ ఐఫోన్ 12

యాపిల్ ఐఫోన్ 12

యాపిల్ ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లను విడుదల చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్‌, ఐఫోన్ 12 మినీ. ధర, ఫీచర్ల పరంగా వీటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ.. ఈ ఫోన్లు 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. ఇందుకోసం వీటిలో యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఏ 14 బయోనిక్ చిప్‌ను ఉపయోగించారు. నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి 4జీ/5జీకి మారేందుకు వీలుగా ఈ ఫోన్లలో స్మార్ట్‌ డేటా మోడ్ ఉంది. అన్నింటిలోనూ సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఇస్తున్నారు.

ధర పరంగా ఐఫోన్ 12 మినీ రూ. 69,900, ఐఫోన్ 12 రూ. 79,900, ఐఫోన్ 12 ప్రొ రూ. 1,19,900, ఐఫోన్ ప్రొమ్యాక్స్‌ రూ 1,29,000.

2. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. వీటిలో గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మోడల్‌ మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎగ్జినోస్‌ 990 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.9-అంగుళాల డబ్ల్యూహెచ్‌డీ ఇన్ఫీనిటీ ఓ డైనమిక్‌ అమోలెడ్ 2ఎక్స్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఫోన్‌తో పాటు ఎస్‌-పెన్ అదనం. 8జీబీ ర్యామ్‌/256జీబీ అంతర్గత స్టోరేజి వేరియంట్ ధర రూ. 1,04,999. శాంసంగ్‌ తొలి మడతబెట్టే ఫోన్ జెడ్‌ ఫోల్డ్2 కూడా 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది.

దీని ధర రూ. 1,49,999.

3. వివో ఎక్స్‌50 ప్రో

వివో ఎక్స్‌50 ప్రో

వివో భారత్ మార్కెట్లో అందిస్తున్న తొలి 5జీ ఫోన్. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 76 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌/128జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.

ధర రూ. 49,990.

4. షావోమి ఎంఐ 10టీ 5జీ

షావోమి ఎంఐ 10టీ 5జీ

షావోమి కంపెనీ ఎంఐ 10టీ సిరీస్‌లో రెండు ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో. ఈ రెండు మోడల్స్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. వీటిలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.67-అంగుళాల ట్రూకలర్ డాట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 10టీ 6జీబీ ర్యామ్‌/128జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 10టీ ప్రో 8జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 35,999.

5. వన్‌ప్లస్‌ 8 అండ్ నార్డ్‌

వన్‌ప్లస్‌ 8 అండ్ నార్డ్‌

వన్‌ప్లస్‌ భారత మార్కెట్లోకి నాలుగు 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. వన్‌ప్లస్‌ 8 సిరీస్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌. వన్‌ప్లస్‌ 8 సిరీస్‌లో మూడు వేరియంట్లున్నాయి. వన్‌ప్లస్‌ 8, 8 ప్రో, 8టీ. మూడు వేరియంట్లలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నార్డ్‌ మోడల్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వన్‌ప్లస్‌ నార్డ్‌లో 6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8 (6.55-అంగుళాలు), 8ప్రో (6.78-అంగుళాలు), 8టీ (6.55-అంగుళాలు)లో అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు.

వన్‌ప్లస్‌ 8 సిరీస్‌ ధర రూ, 41,999 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్‌/128జీబీ, 8జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో లభిస్తాయి. ఇక వన్‌ప్లస్‌ నార్డ్ ప్రారంభ ధర రూ. 24,999. 6జీబీ ర్యామ్‌/64జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో ఈ మోడల్‌ లభిస్తుంది.

6. అసుస్‌ రోగ్ ఫోన్‌ 3

అసుస్‌ రోగ్ ఫోన్‌ 3

అసుస్‌ నుంచి వచ్చిన తొలి 5జీ ఫోన్ ‘రోగ్‌ ఫోన్‌ 3’. గేమర్స్‌ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 865+ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌/128జీబీ, 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

దీని ప్రారంభ ధర రూ. 46,999.

7. మోటో రేజర్‌ 5జీ

మోటో రేజర్‌ 5జీ

మోటోరోలా అందిస్తున్న తొలి ఫోల్డింగ్ ఫోన్. అంతేకాదు రేజర్‌ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 76 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.2-అంగుళాల ఫోల్డింగ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు 2.7-అంగుళాల జీఓఎల్‌ఈడీ క్విక్‌ వ్యూ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్లో లభిస్తుంది.

దీని ధర రూ. 1,24,999.

త్వరలో భారత మార్కెట్లో విడుదలకానున్న 5జీ ఫోన్లు..

1. రెడ్‌మీ నోట్‌ 9 5జీ

రెడ్‌మీ నోట్‌ 9 5జీ

రెడ్‌మీ నుంచి వస్తున్న తొలి 5జీ ఫోన్‌. నోట్‌ 9 ప్రో 5జీ, నోట్ 9 5జీ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ రెండు మోడల్స్‌ 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్‌ చేస్తాయి. నోట్ 9 ప్రో 5జీలో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ను, నోట్‌ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నోట్‌ 9 ప్రో 5జీ ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, నోట్ 9 5జీలో 6.53-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ పంచ్‌ హోల్ డిస్‌ప్లే ఇస్తున్నారు. రెండు మోడల్స్‌ 6జీబీ ర్యామ్‌/128జీబీ, 8జీబీ ర్యామ్‌/128జీబీ, 8జీబీ ర్యామ్‌/256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లను భారత మార్కెట్లో రూ.20,000 లోపు ధరలో విడుదలచేయాలని కంపెనీ భావిస్తోందట. ఒకవేళ అదే జరిగితే అతి తక్కువ ధరలో లభించే తొలి 5జీ ఫోన్ ఇదే.

2. రెడ్‌మీ కే30 ప్రో

రెడ్‌మీ కే30 ప్రో

రెడ్‌మీ నుంచి వస్తున్న మరో 5జీ ఫోన్ కే30 ప్రో. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను ఉపయోగించారట. 6.67-అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారట. చైనా మార్కెట్లో 6జీబీ ర్యామ్‌/128జీబీ, 8జీబీ ర్యామ్/128జీబీ, 8జీబీ/256జీబీ, 12జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. భారత్‌లో ఎన్ని వేరియంట్లో లభిస్తుందనే దానిపై పూర్తి సమాచారం లేదు.

ధర రూ. 30,000 నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

3. వన్‌ప్లస్‌ నార్డ్ 10 5జీ

వన్‌ప్లస్‌ నార్డ్ 10 5జీ

వన్‌ప్లస్‌ నుంచి భారత మార్కెట్లోకి వస్తున్న మరో 5జీ ఫోన్. ఇందులో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 690 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.49-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లో తీసుకొస్తున్నారట.

ధర రూ.30,000లోపు ఉంటుందట.

4. మోటో జీ 5జీ

మోటో జీ 5జీ

తక్కువ ధరలో 5జీ ఫోన్ తీసుకురావాలనే లక్ష్యంతో మోటోరోలా జీ 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇందులో క్వాల్‌కోమ్ 765 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సినిమా విజన్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4జీబీ ర్యామ్/64జీబీ, 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

ధర రూ. 30,000లోపు ఉంటుందని సమాచారం.

5. వివో వి20 ప్రో

వివో వి20 ప్రో

డిసెంబర్‌ 2 తేదీన ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇది 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

8జీబీ ర్యామ్/256జీబీ వేరియంట్‌ ధర రూ. 30,000లోపు ఉంటుందని తెలుస్తోంది.

6. గూగుల్ పిక్సెల్​ 5

గూగుల్ పిక్సెల్​ 5

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటలో ఉంది. 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5.81-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్‌ ధర రూ. 31,999 ఉంటుందని అంచనా. త్వరలో భారత్‌ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవే కాకుండా రిలయన్స్ జియో, శాంసంగ్, రియల్‌మీ కంపెనీలు కూడా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌లను తీసుకురానున్నాయి.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details