తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆ కారుకు 'కీ'గా చిన్నారుల స్మార్ట్​వాచ్ - Elon Musk

ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ టెస్లా.. పిల్లల కోసం స్మార్ట్​ వాచ్​ అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ వాచ్​ కారు 'కీ' గానూ పని చేయనుంది. దీని ద్వారా ఎలాంటి తాళం లేకుండానే చిన్నారులు కారులోకి ప్రవేశించొచ్చు. ఇందుకోసం నార్వేకు చెందిన ఎక్స్​ప్లోరా టెక్నాలజీస్​తో టెస్లా కలిసి పనిచేయనుంది.

TESLA SMARTWATCH
ఈ చిన్నారుల స్మార్ట్​వాచ్​ కారు 'కీ' గానూ పనిచేస్తుంది

By

Published : Aug 12, 2020, 3:49 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

అమెరికా శాన్​ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల దిగ్గజం, ఎలాన్​ మస్క్​ ఆధ్వర్యంలోని టెస్లా.. చిన్నారుల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల కోసం స్మార్ట్​ వాచ్​లను తయారు చేసేందుకు నార్వేకు చెందిన ఎక్స్​ప్లోరా టెక్నాలజీస్​తో పని చేయనుంది. ఈ స్మార్ట్​ వాచ్​ కారు కీ గానూ పని చేయనుందని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతానికి టెస్లా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఎక్స్​ప్లోరా స్మార్ట్​వాచ్​ అభివృద్ధిలో టెస్లా పాలుపంచుకుంటున్నట్లు అమెరికా ఫెడరల్​ కమ్యూనికేషన్​ కమిషన్​ (ఎఫ్​సీసీ) ఫైలింగ్​ ద్వారా తెలిసింది.

భవిష్యత్తులో..

భవిష్యత్తులో పిల్లల కోసం మరిన్ని భద్రతాపరమైన ఫీచర్లు తీసుకురావాలని భావిస్తోంది టెస్లా. ఇప్పటికే మోడల్​-3, వైలలో కీ ఫోబ్స్​కు బదులుగా ఫోన్​లను ఉపయోగంలోకి తెచ్చింది. దీనికి అదనంగా స్మార్ట్​ వాచ్​ను ఐచ్ఛిక కీగా వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఐఓఎస్​లోనూ గూగుల్ మ్యాప్స్​- త్వరలో విడుదల

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details